AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండాకాలంలో కూడా పాదాలు పగులుతున్నాయా ? అయితే ఇలా చేయండి.. సమస్యను దూరం పెట్టండి..

Summer Skin Tips: వేసవికాలంలో పాదాల పగుళ్లు చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఎందుకంటే పాదాల మీద చర్మం

ఎండాకాలంలో కూడా పాదాలు పగులుతున్నాయా ? అయితే ఇలా చేయండి.. సమస్యను దూరం పెట్టండి..
Cracked Heel
Rajitha Chanti
|

Updated on: Apr 27, 2021 | 4:24 PM

Share

Summer Skin Tips: వేసవికాలంలో పాదాల పగుళ్లు చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఎందుకంటే పాదాల మీద చర్మం త్వరగా పొడిబారుతుంది. కారణం అక్కడ ఆయిల్ గ్లాండ్ ఉండకపోవడం. దీంతో పగుళ్లు ఏర్పడుతాయి. మాయిశ్చర్ లేకపోవడం, పోల్యూషన్ ఎక్కువ కావడం, మెడికల్ కండిషన్స్ కూడా పాదాల పగుళ్లకు కారణమవుతుంటాయి. అయితే వీటిని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల క్రీములు వాడుతుంటారు. అలా కాకుండా ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. అదెలాగో చూద్దామా.

1. ఒక నిమ్మకాయని సగానికి కోసి ఆ చెక్కని పంచదారలో అద్ది మీ పాదాలపై మృదువుగా చేయండి. ఆ తర్వాత శుభ్రంగా కడిగేసి, మెత్తగా అద్ది, మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇలా రోజూ చేయవచ్చు.

2. ఒక టీ స్పూన్ వేసలీన్ ఐదు చుక్కల నిమ్మరసం కలపండి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటిలో పదిహేను నిమిషాలు పాదాలు ఉంచి ఆ తరువాత బట్టతో అద్ది, ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. సాక్స్ వేసుకుని రాత్రంతా వదిలేయండి. రాత్రి నిద్రకి ముందు రోజూ ఇలా చేయండి.

3. గోరు వెచ్చని నీటిలో ఇరవై నిమిషాలు మీ పాదాలు ఉంచి మెత్తని బట్టతో అద్దండి. ఆ తరువాత కలబంద జెల్ అప్లై చేసి సాక్స్ వేసుకుని రాత్రంతా వదిలేయండి. ప్రతి రోజూ రాత్రి నిద్రకి ముందు ఇలా చేయవచ్చు.

4. ఒక అర బకెట్ గోరు వెచ్చని నీటిలో ఒక కప్పు తేనె వేసి ఆ నీటిలో మీ పాదాలు ఉంచి ఇరవై నిమిషాలు ఉంచండి. ఆ తరువాత మృదువుగా స్క్రబ్ చేసి డెడ్ స్కిన్ ని తొలగించండి. ఆ తరువాత పాదాలు శుభ్రంగా కడిగేసి, మెత్తని బట్టతో అద్ది మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇలా రోజూ చేయవచ్చు.

5. ఒక బేసిన్ గోరు వెచ్చని నీరు తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా కలపండి. ఆ నీటిలో మీ పాదాలు ఉంచి పదిహేను నిమిషాలు రిలాక్స్ అవ్వండి. ఆ తరువాత ప్యూమిస్ స్టోన్ తో స్క్రబ్ చేయండి. ఆ తరువాత పాదాలు శుభ్రంగా కడిగేసి మెత్తని బట్టతో అద్ది మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేయవచ్చు.

రోజూ పాటించాల్సిన మరిన్ని టిప్స్… *. ఉప్పు, లేదా నిమ్మ రసం కలిపిన గోరు వెచ్చని నీటిలో పాదాలు ఉంచుతూ ఉంటే పాదాలు క్లీన్ గా సాఫ్ట్ గా ఉంటాయి. * పాదాలని రెగ్యులర్ గా ప్యుమిస్ స్టోన్ తో స్క్రబ్ చేస్తూ ఉండండి. * పాదాలని సరిగ్గా మాయిశ్చరైజ్ చేస్తూ ఉండండి. * మీకు సౌకర్యంగా ఉన్న షూస్ మాత్రమే వాడండి. * మరీ ఎక్కువ దూరం నడవకండి. * ఫుట్ మసాజ్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది.

Also Read: Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక రెగ్యులర్ మందులు వాడొచ్చా. ? డాక్టర్ల సూచనలు ఎంటంటే..