Corona symptoms: మీకు కరోనా వచ్చిందని అనుమానంగా ఉందా ? .. అయితే మీ గొంతులో ఈ మార్పులను గమనించండి…
Corona symptoms: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. అలాగే మొదటి వేవ్ కంటే
Corona symptoms: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. అలాగే మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ లో ఈ వైరస్ లక్షణాలలో కూడా మార్పులు జరిగినట్లుగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ సెకండ్ వేవ్ లో కరోనా రోగులలో జ్వరం, దగ్గు మరియు వాసన, రుచి మందగించడమే కాకుండా కాకుండా మరిన్ని లక్షణాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా లక్షణాలపై జరిపిన ఓ అధ్యాయనం ప్రకారం.. కరోనా సోకిన వ్యక్తులలో గొంతులో మార్పులు జరుగుతున్నాయని తేలింది. అయితే మన గొంతులో వచ్చే మార్పులను మనం ఎక్కువగా పట్టించుకోము కానీ గొంతు బొంగురుగా రావడమే కాకుండా.. పెద్దగా రావడమనేది జరుగుతుందని యుకేలోని చాలా మంది నిపుణులు సూచిస్తున్నారు.
అయితే కరోనా వచ్చిన వారి గొంతులో కొన్ని చిన్న చిన్న మార్పులు జరుగుతాయని సూచించారు. గొంతు పొడిబారడం, చిన్నగా రావడం, అలాగే గొంతులో పిచ్ కలిగి ఉన్నట్లుగా ఉంటుందని నిపుణులు సూచించారు. కరోనా వైరస్ శ్వాసకోశ వ్యవస్థలోని కణజాలాలను ప్రభావితం చేస్తుందని.. స్వరపేటకిపై ప్రభావం చూపిస్తుందని.. ఈ కారణంగానే గొంతులో మార్పులు రానున్నట్లుగా చెప్పారు. అయితే అన్ని గొంతు సమస్యలు కరోనా కాదని.. గొంతు రఫ్ గా అనిపిస్తే.. కచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.
గొంతులో మార్పులు అనిపిస్తే ఇలా చేయండి..
మీ గొంతులో మార్పులు జరుగుతాయి. ఒక వేళ మీ గొంతులో అలాంటి లక్షణాలు కనిపిస్తే.. ఇంట్లో వాళ్ళకు దూరంగా ఉండడం ఉత్తమం. ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం ఉత్తమం. అలాగే చల్లని వస్తువులను తినకండి. ఎప్పుడూ గోరువెచ్చని నీటిని తాగడం ఉత్తమం. అలాగే ఎప్పుడూ మీ గొంతును హైడ్రేటెడ్ గా ఉంచాలి. గొంతు నొప్పిని తగ్గించడానికి మూలికా నివారణాలను కూడా ప్రయత్నించవచ్చు.
కరోనా లక్షణాలు..
జ్వరం. పొడి దగ్గు గొంతులో మంట ముక్కు పట్టెసినట్లుగా ఉండటం. ఛాతీ నొప్పి, ఉపిరి తీసుకోవడంలో సమస్య. అలసట జీర్ణమశయాంతర సంక్రమణ. వాసన రాకపోవడం. రుచి తెలియకోవడం.
Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక రెగ్యులర్ మందులు వాడొచ్చా. ? డాక్టర్ల సూచనలు ఎంటంటే..