AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health News: రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ మూడు డ్రింక్స్ రోజూ ప్రొద్దునే తాగాలట.!

కరోనావైరస్ సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా భయాందోళనలు గురి చేస్తోంది. గతంలో కంటే ఈసారి పాజిటివిటీ రేటు అధికంగా ఉండటంతో..

Health News: రోగనిరోధక శక్తి పెరగాలంటే ఈ మూడు డ్రింక్స్ రోజూ ప్రొద్దునే తాగాలట.!
Immunity Drink
Ravi Kiran
|

Updated on: Apr 27, 2021 | 3:48 PM

Share

కరోనావైరస్ సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా భయాందోళనలు గురి చేస్తోంది. గతంలో కంటే ఈసారి పాజిటివిటీ రేటు అధికంగా ఉండటంతో రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే మనం రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించడం చాలా అవసరం. 

మనలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటే అంటువ్యాధులతో గట్టిగా పోరాడవచ్చు. అలాగే, సంక్రమణ ప్రమాదం కూడా తగ్గుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి మీరు ఖాళీ కడుపుతో ప్రతిరోజూ ఈ మూడు డ్రింక్స్ తాగండి. ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉండండి. 

రోగనిరోధక శక్తిని పెంచే పానీయం..

1. ఆపిల్ రసం 2. అరకప్పు నీరు 3. 1/4 టీస్పూన్ పొడి అల్లం 4. 1/4 టీస్పూన్ పసుపు 5. ఒక టీస్పూన్ ఆపిల్ సైడల్ వెనిగర్ 6. ఒక టీస్పూన్ తేనె

తయారీ విధానం

ఒక కప్పు నీటిలో అల్లం, పసుపు కలపాలి. నీటిని 5 నుండి 10 నిమిషాలు వేడి చేసి, ఆ తర్వాత వాటిని గోరువెచ్చగా చల్లబరిచి ఈ మిశ్రమాన్ని కలపాలి. ఆ మిశ్రమాన్ని తర్వాత ఫిల్టర్ చేసి, ఒక కప్పులో ఉంచి, ఆపై తేనె కలపండి. ఈ డ్రింక్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.

ఆపిల్ సైడర్ వెనిగర్ మైక్రో ఆర్గానిజమ్స్ ను నిరోధించే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహకరిస్తుంది. అల్లం, పసుపులో యాంటీఆక్సిడెంట్, ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నాయి. పసుపు, అల్లం శరీరంలోని తెల్ల రక్త కణాలను పెంచడానికి పనిచేస్తాయి, ఇవి బాహ్య సూక్ష్మక్రిములతో పోరాడటానికి పనిచేస్తాయి.

సెలెరీ వాటర్

1.సెలెరీ గింజలు సగం టీస్పూన్ 2. 5 తులసి ఆకులు 3. సగం టీస్పూన్ మిరియాలు పొడి 4. ఒక టీస్పూన్ తేనె

తయారీ విధానం

ఒక పాన్ తీసుకొని ఒక గ్లాసు నీరు, సెలెరీ, తులసి ఆకులు, నల్ల మిరియాలు పొడి వేసి సుమారు 5 నిమిషాలు ఉడకనివ్వాలి ఈ మిశ్రమాన్ని ఒక కప్పులో ఉంచి.. చల్లబరిచిన తర్వాత తేనేను జోడించాలి. 

రోగనిరోధక శక్తి ఎలా పెరుగుతుంది

సెలెరీలో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది వివిధ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది శోథ, కఫం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇవే కాకుండా, తులసి ఆకులు, నల్ల మిరియాలు, తేనె మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తాయి, తద్వారా మీకు వ్యాధుల రాకుండా కాపాడుతుంది.

మరో ఇమ్యూనిటీ డ్రింక్ చేసే పద్దతి…

1. 6 నుండి 7 తులసి ఆకులు 2. 5 లవంగాలు 3. ఒక టీస్పూన్ పొడి అల్లం 4. ఒక కప్పు తిప్పతీగ రసం 5. 2 టీస్పూన్లు నిమ్మరసం 6. నల్ల ఉప్పు

ఎలా చేయాలి

ఒక పాన్ తీసుకొని, ఒక గ్లాసు నీరు, తులసి ఆకులు, లవంగాలు, అల్లం వేసి ఉడకబెట్టాలి. అలా వచ్చిన మిశ్రమాన్ని చల్లార్చి సీసాలోకి తీసుకోండి. ఒక కప్పు తిప్పతీగ రసంలో ఒక టీస్పూన్ నల్ల ఉప్పు, ఒక టీస్పూన్ ముందు తయారుచేసిన మిశ్రమాన్ని కలపండి. ఆ తర్వాత నిమ్మకాయ కలిపితే చాలు. 

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్