ఏసీలు ఆఫ్ చేసి… కిటికీలు, తలుపులు తెరిస్తే కరోనాను కట్టడి చేయవచ్చా ? .. అధ్యాయనాల్లో బయటపడిన ఆసక్తికర విషయాలు..

Corona Virus: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో ఇప్పటికే పలు సంస్థలు

ఏసీలు ఆఫ్ చేసి... కిటికీలు, తలుపులు తెరిస్తే కరోనాను కట్టడి చేయవచ్చా ? .. అధ్యాయనాల్లో బయటపడిన ఆసక్తికర విషయాలు..
Corona
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 28, 2021 | 2:10 PM

Corona Virus: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో ఇప్పటికే పలు సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అవలంభిస్తుండగా.. చాలా మంది ఇంట్లో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఇక కరోనా వ్యాప్తి ఆరికట్టేందుకు ఇంట్లో ఉన్నా కూడా మాస్కులు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా ఇంట్లో ఉన్న సమయంలో ఏసీలను ఆఫ్ చేసి కిటికిలు, తలుపులు తెరచి ఉంచాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎలక్ట్రిక్ పరికరాల నుంచి వచ్చే గాలి కంటే ఆరుబయట నుంచి వచ్చే గాలిని మంచిదని సూచిస్తున్నారు. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ పై జరిపిన లాన్సెట్ పరిశోధనలోనూ ఇవే విషయాలు బయటపడ్డాయి.

ఇక ఇదే విషయంపై అపోలో హాస్పిటల్ అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ రామసుబ్రమణియన్ మాట్లాడుతూ.. “మేము అంటు వ్యాధులతో పోరాడటం లేదు. ఒక వైరస్ తో పోరాడుతున్నాం. కానీ వైరస్ పట్ల ప్రస్తుతం ఎక్కువగా ఫేక్ న్యూస్ చూస్తున్నాను. దీని వలన ప్రజలలో అపనమ్మకం ఏర్పడడమే కాకుండా.. భయం మరింత పెరిగే అవకాశం ఉంది “అని అన్నారు. గతేడాది కరోనా వలన ప్రజలంతా బాధ్యతగా ఉన్నారు. కానీ వైరస్ కేసుల సంఖ్య తగ్గుతూ రావడంతో జాగ్రత్తలు పాటించడం మానేశారు. నిజానికి ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కారణం.. జిమ్స్, వివాహ వేదికలు, హోటళ్లు, స్వీమ్మింగ్ ఫుల్స్ , ప్రయాణాలు, పాఠశాలలు తెరవడం.. అక్కడ కరోనా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే కరోనా బాధితుల సంఖ్య ఆకస్మాత్తుగా ఇలా గణనీయంగా పెరిగిందని డాక్టర్ తెలిపారు. అనవసరంగా గుంపులుగా తిరగడం, మాస్కులు ధరించకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడం వలన ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడిందనే విషయం ఇప్పటికైన ప్రజలు గ్రహించాలని సూచించారు. Dr V Ramasubramanian, infectious diseases expert.

ఇంట్లో ఉన్నకానీ మాస్క్ ధరించడం.. 6 అడుగుల దూరాన్ని పాటించడమనేది ముఖ్యం. ఇంట్లో ఉన్న సమయంలో ఏసీలు, ఇతర ఎయిర్ కండిషనర్స్ ఆఫ్ చేయాలని.. బదులుగా కిటికిలు, తలుపులు తెరచిపెట్టడం వలన స్వచ్చమైన గాలిని పీల్చుకుంటారని తెలిపారు. ఇంట్లో ఉన్న సమయంలోనే ఎక్కువగా అంటు వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంటుందని డాక్టర్ రామ సుబ్రమణియన్ తెలిపారు. అలాగే ఆవిరి తీసుకోవడమనేది కరోనాను పూర్తిగా నియంత్రించలేదని.. కేవలం శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుందని తెలిపారు.

Also Read: Corona symptoms: మీకు కరోనా వచ్చిందని అనుమానంగా ఉందా ? .. అయితే మీ గొంతులో ఈ మార్పులను గమనించండి…

కరోనా రిపోర్ట్ నెగిటివ్ వచ్చిందా.. అయితే ఈ విషయాల్లో మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే మోసం మొదటికే..