‘వకీల్ సాబ్’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో..! ఫ్యాన్స్‌కి పండగే.. వెంటనే చూసి ఆనందించండి..

Vakeel Saab Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన టాలీవుడ్ చిత్రం వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న థియేటర్లలో విడుదలైంది. ప్రముఖ హిందీ చిత్రం పింక్ తెలుగు రీమేక్ ఈ సినిమా.

  • uppula Raju
  • Publish Date - 2:12 pm, Fri, 30 April 21
'వకీల్ సాబ్' ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో..! ఫ్యాన్స్‌కి పండగే.. వెంటనే చూసి ఆనందించండి..
Vakeel Saab Movie

Vakeel Saab Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన టాలీవుడ్ చిత్రం వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న థియేటర్లలో విడుదలైంది. ప్రముఖ హిందీ చిత్రం పింక్ తెలుగు రీమేక్ ఈ సినిమా. ఇప్పుడు ఈ చిత్రం ఈ రోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతుంది. డిజిటల్ ప్రీమియర్ గురించి నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ. సినిమా హాళ్ళలో సినిమా చూసిన అభిమానులు ఈ చిత్రాన్ని ఇష్టపడ్డారు అభినందించారు. నిర్మాతకు ఇంతకంటే గొప్ప అనుభూతి మరొకటి లేదు. అయితే కరోనా పరిస్థితుల్లో చాలామంది అభిమానులు థియేటర్లలో సినిమా చూడలేకపోయారు. అందుకే అమెజాన్‌ ప్రైమ్ లో అందరికి అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.

పింక్‌లో అమితాబ్ పోషించిన పాత్రను ఇందులో పవన్ కల్యాణ్ పోషించారు. తాప్సీ పన్నూ, కీర్తి కుల్హారీ, ఆండ్రియా తారియాంగ్ పాత్రలను.. నివేదా థామస్, అనన్య నాగల్లా, అంజలి పోషించారు. శ్రుతి హాసన పవన్ భార్యగా నటించారు. ప్రకాష్ రాజ్ కూడా కీలక పాత్రలో నటించారు. తీవ్రమైన కేసులో చిక్కుకున్న ముగ్గురు అమ్మాయిల చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. మహిళలపై లైంగిక హింస, లైంగిక సమ్మతి వంటి ఇతివృత్తాలను అన్వేషిస్తాయి. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా రీమేక్ చేశారు కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించడం విశేషం.

తొలి వారం వ‌కీల్ సాబ్ థియేటర్స్ అన్ని హౌజ్ ఫుల్ కాగా, రెండో వారానికి ప‌రిస్థితులు అన్ని తారుమారు అయ్యాయి. క‌రోనా వ్యాప్తి విజృంభిస్తున్న నేప‌థ్యంలో జ‌నాలు థియేట‌ర్స్‌కు రావ‌డమే మానేశారు. దీంతో చేసేదం లేక వ‌కీల్ సాబ్ చిత్రాన్ని ఏప్రిల్ 30(నేడు) నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. 50 రోజుల తర్వాత వకీల్ సాబ్‌ను ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు కాని, ప‌రిస్థితుల వల్ల ముందే స్ట్రీమిగ్ చేయ‌క త‌ప్పలేదు.

జూలై-ఆగష్టులో కరోనా థర్డ్ వేవ్.. ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం: మంత్రి కీలక వ్యాఖ్యలు

Punjab State Cooperative Bank: పంజాబ్ కోప‌రేటివ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ ఎప్పుడంటే..