జూలై-ఆగష్టులో కరోనా థర్డ్ వేవ్.. ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం: మంత్రి కీలక వ్యాఖ్యలు

కోవిడ్ థర్డ్‌ వేవ్‌ జులై ఆగస్ట్‌లో మహారాష్ట్రను కుదిపేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే సెకండ్ వేవ్‌...

జూలై-ఆగష్టులో కరోనా థర్డ్ వేవ్.. ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం: మంత్రి కీలక వ్యాఖ్యలు
Ravi Kiran

|

Apr 30, 2021 | 2:31 PM

కోవిడ్ థర్డ్‌ వేవ్‌ జులై ఆగస్ట్‌లో మహారాష్ట్రను కుదిపేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే సెకండ్ వేవ్‌ ధాటికి ఆ రాష్ట్రం వణికిపోతోంది. రాబోయే రెండు నెలల్లో థర్డ్‌ వేవ్‌ ప్రభావాన్ని చూడనున్నట్లు ఆరోగ్యమంత్రి బాంబు పేల్చారు. థర్డ్‌ వేవ్‌ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని అన్నారు.

సెకండ్‌ వేవ్‌ ఉధృతిని అదుపులోకి తీసుకురావడానికి ప్రస్తుతం మహారాష్ట్ర సర్కార్‌ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. నెల రోజులుగా సెకండ్‌ వేవ్‌ తీవ్రత నుంచి కోలుకోలేకపోతున్న ఆ రాష్ట్రంలో జులై ఆగస్ట్‌ నెలలో థర్డ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగే అవకాశం ఉందని ఆరోగ్యమంత్రి రాజేష్‌ తోపె అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వైరస్‌ విస్తృతిని బట్టి అంటువ్యాధుల నిపుణులు ఈ అంచనాకు వచ్చినట్లు తెలిపారు. సెకండ్‌ వేవ్‌ ఉధృతి మే చివరినాటికి గరిష్టస్థాయికి చేరుకుంటుందని అంచనా వేసారు.

థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేసారు. రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్‌ అందుబాటులో ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా రోజుకి 65 వేల కేసులు బయటపడుతున్నాయి. ఏప్రిల్‌ 29 ఒక్కరోజే 66,159 కేసులు నమోదు కాగా.. 771 మంది చనిపోయారు.

Read also: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?

ఈనెల 28 నుంచి జూన్‌ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..

 ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu