AP COVID KITS: ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!

ఇంట్లోనే ఉండి కరోనాను నయం చేసుకుంటున్నారన్న విషయం చాలా మందికి తెలియడం లేదు. ఇలాంటి వారికి ఏపీ ప్రభుత్వం కరోనా కిట్లు ఇస్తూ వారికి వైద్యంతో ధైర్యం అందిస్తోంది.

AP COVID KITS: ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!
Andhra Pradesh Government Covd 19 Home Isolation Kits
Follow us

|

Updated on: Apr 26, 2021 | 3:16 PM

AP Covd 19 home isolation kits: కరోనా వచ్చిందంటే చాలు… ఆసుపత్రులకు పరుగులు తీయాలి.. బెడ్ దొరుకుతుందో లేదో భయం.. దొరికినా నయం అవుతుందా లేదోనన్న సందేహం. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇదే ఆందోళనలో ఉన్నారు. కానీ 85శాతం మందికి పైగా ఇంట్లోనే ఉండి కరోనాను నయం చేసుకుంటున్నారన్న విషయం చాలా మందికి తెలియడం లేదు. ఇలాంటి వారికి ఏపీ ప్రభుత్వం కరోనా కిట్లు ఇస్తూ వారికి వైద్యంతో ధైర్యం కూడా అందిస్తూ… కరోనాను దూరం చేసే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కరోనా కిట్ల పంపిణీ చేపడుతోంది.

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని మొత్తం వణికిస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో వైరస్ దూకుడు మామూలుగా లేదు. కేసుల సంఖ్య వందలు, వేలు దాటి లక్షలకు చేరుకుంటోంది. యాక్టీవ్ కేసులు వేల సంఖ్యలో చేరుకుంటుండటంతో బెడ్ల సమస్య తీవ్రంగా ఉంది.. అలాగే, ఆరోగ్యం విషమించి ఉపిరాడక ఆక్సిజన్ సమస్య తలెత్తుతోంది. ఇదిలావుంటే, అసలు కరోనా వచ్చిన వారిలో వందకు 85మంది ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. అసలు కొందరికి చికిత్స లేకుండానే నయం అవుతోంది. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించకుండా ఆందోళన చెందుతున్నారు. ప్రణాళిక బద్ధంగా కిట్ల పంపిణీ… కరోనా సోకినవారిని ఏపీ ప్రభుత్వం హోం క్వారంటైన్‌లో ఉండేలా ప్రోత్సహిస్తోంది. దీనికి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్తోంది. ప్రధానంగా టెస్టు చేయించుకున్న తర్వాత పాజిటీవ్ రాగానే వారికి ఫోన్ వెళ్తుంది. మీకు ఏమైనా సింటమ్స్ ఉన్నాయా.. ఆరోగ్యం ఎలా ఉందన్నది.. ఎలాంటి సింటమ్స్ లేకపోయినా, లేక మైల్డ్ సింటమ్స్ ఉన్నా.. ఇంట్లోనే ఉండాలని సూచిస్తోంది. మీరు ఎలాంటి చికిత్సలు పొందాలన్నది గైడ్ చేస్తున్నారు. ఇందుకోసం 104 నెంబర్ తో కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. కొద్ది పాటి సింటమ్స్ ఎక్కువగా ఉంటే.. క్వారంటైన్ సెంటర్స్ కు తరలిస్తున్నారు. ఇంకా బ్రీతింగ్ లెవల్స్ పడిపోతే ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. ఆరోగ్య పరిస్థితిపై సిబ్బంది ఆరా… ఇందుకోసం ఏఎన్ఎమ్ లు, ఆశావర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు అందరూ పని చేస్తున్నారు. కరోనా బాధితుల బాగోగులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. హోం క్వారంటైన్ లో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా కరోనా కిట్ల పంపిణీ చేపట్టింది. ఈ క్విట్ల ద్వారానే కరోనా నయం చేసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

ఇంతకీ కరోనా కిట్స్ లో ఏమేముంటాయి…

1. విటమిన్ C 500mg ట్యాబ్లెట్స్ 2. జింక్ 20mg ట్యాబ్లెట్స్ 3. విటమిన్ D3 60000 16 క్యాప్సిల్స్ 4. B- కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ 5. పారసిటమల్ 650mg ట్యాబ్లెట్స్ 6. సిట్రజిన్ 10mg ట్యాబ్లెట్స్ 7. ప్యాంటప్రోజోల్ 40mg ట్యాబ్లెట్స్ 8. యాంటిబయోటిక్స్

ఈ ఎనిమిది రకాల టాబ్లెట్స్ తో పాటు మాస్కులు, గ్లౌజ్ లు, శానిటైజర్ ను ఇంటి వద్దకే వెళ్లి ఎఎన్ఎంలు, ఆశావర్కర్ లు అందజేస్తున్నారు… ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి… వాస్తవంగా ఆసుపత్రిలో ఉన్నప్పటికీ ఇదే టాబ్లెట్స్ ఉంటాయని.. కాకపోతే అక్కడ డాక్టర్స్ మానటరింగ్ ఉంటుంది. అయితే, ఈ కిట్లు ఎంత వరకు అందుతున్నాయి. అసలు వాస్తవంగా బాధితులకు చేరుతున్నాయా అన్నదానిపై అనంతపురం జిల్లాలోని టీవీ9 టీం గ్రౌండ్ లేవల్లో పరీశీలించింది. నేరుగా బాధితులతోనూ, అలాగే హోం క్వారంటైన్ లో ఉండి నయమైన వారిని, లోకల్ గా ఉన్న మెడికిల్ ఆఫీసర్లను పలుకరించింది. అయితే వీటిలో చాలా మంది తమకు కిట్లు అందుతున్నాయని చెప్పారు. గతం కంటే పరిస్థితి ఇప్పుడుమెరుగ్గా ఉందని చెబుతున్నారు… కనిపించని మందుల జాడ… అయితే, కొన్ని ప్రాంతాల్లో ఇంకో కోణం కూడా కనిపిస్తోంది. అసలు తమకు కిట్లే అందడం లేదని కొందరంటే.. మరికొందరు వాటి గురించి ఊసే తమకు తెలియదంటున్నారు. జిల్లాలో కోవిడ్ బాధితుల్లో 84 శాతం మంది ఇంట్లోనే ఉండి వైద్యం పొందుతున్నారు. అయితే, వైద్య సలహాలిచ్చేవారిలో కొన్ని చోట్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. కోవిడ్ పాజిటివ్ అని తేలిన వెంటనే కాల్ సెంటరు నుంచి మీకు పాజిటీవ్ వచ్చింది.. ఇంటి నుంచి బయటకెళ్లవద్దు అని ఒకేఒకసారి ఫోన్ వెళ్తుంది. అంతే.. ఆ తరువాత వారి పరిస్థితిని పర్యవేక్షించే వారు కరువయ్యారు. కొందరు ఇంట్లో సొంత వైద్యంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కిట్స్ అందిస్తున్నామని అక్కడి అధికారుల మాటలే కానీ.. ఇంతవరకు ఆ కిట్స్ ఎలాగుంటాయో కూడా చూడలేదని కోవిడ్ బాధితులు చెబుతున్నారు.

ఓవర్ ఆల్ గా అనంతపురం జిల్లాలో పరిస్థితి చూస్తే కోవిడ్ కిట్లు చాలా వరకు అందుతున్నాయి. అయితే, కొన్ని మారుమూల ప్రాంతాల వారికి వీటిని అందించడంలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. మరోవైపు, టాబ్లెట్స్ వరకు అందుతున్నా.. మాస్కులు, శానిటైజర్, గ్లౌజ్ ల కొరత కనిపిస్తోంది. ఉన్న కాస్త నిర్లక్ష్యాన్ని కూడా పక్కనబెడితే వందకు 85శాతం మంది ఆసుపత్రికి వెళ్లకుండా కరోనాను జయించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read Also…  తెలుగు రాష్ట్రాల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా.. ఎటు చూసినా అయోమయం.. పడకలు దొరక్క, ఆక్సిజన్ అందక అవస్థలు!