RMP doctor: తెల్ల కోటు.. నల్ల దందా.. ఆర్ఎంపీ ముసుగులో మల్టీ స్పెషాలిటీ వైద్యం.. గుట్టురట్టు చేసిన వైద్యాధికారులు

కరోనా సామాన్యులకు శాపంగా మారితే ఉత్తుత్తి డాక్టర్లకు పెద్ద వరంగా మారింది. కరోనా సమయంలో ప్రతి వైద్యుడు దేవుడిగా మారి సేవలందిస్తుంటే.. కొందరు కంత్రిగాళ్లు మాత్రం వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు..

RMP doctor: తెల్ల కోటు.. నల్ల దందా.. ఆర్ఎంపీ ముసుగులో మల్టీ స్పెషాలిటీ వైద్యం.. గుట్టురట్టు చేసిన వైద్యాధికారులు
Rmp Doctor Providing Corona Treatment
Follow us

|

Updated on: Apr 26, 2021 | 1:21 PM

RMP doctor providing corona treatment: కరోనా సామాన్యులకు శాపంగా మారితే ఉత్తుత్తి డాక్టర్లకు పెద్ద వరంగా మారింది. కరోనా సమయంలో ప్రతి వైద్యుడు దేవుడిగా మారి సేవలందిస్తుంటే.. కొందరు కంత్రిగాళ్లు మాత్రం వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు.. అదీగాక కరోనా విపత్తు సమయంలో కొన్ని చోట్ల పేదల పొట్ట కొట్టడానికి కొందరు దరిద్రులు కూడా వెనుకాడటం లేదు..తన ఇంట్లోనే హాస్పిటల్‌ తెరిచి, ఐసీయూ నిర్వహణ., మెడికల్‌ షాప్‌ ఇది.. ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.. కడప జిల్లా పెండ్లిమర్రిలో ఆర్‌ఎంపీ వరదారెడ్డి.. కరోనా సమయాన్ని ఆసరాగా చేసుకొని ఇంట్లోనే పేషంట్లకు ఆక్సిజన్‌ అందిస్తున్నాడు ఈ నాటువైద్యుడు

కరోనా పేరుతో చికిత్స అందిస్తున్న ఒక ఆర్‌ఎంపీ నడుపుతున్న చీకటి భాగోతం కడప జిల్లాలో వెలుగులోకి వచ్చింది.. జిల్లాలోని పెండ్లిమర్రి మండలం కేంద్రానికి చెందిన వరదా రెడ్డి ఆర్ఎంపి వైద్యుడుగా కొనసాగుతున్నాడు. చిన్న చిన్న వాటికి ప్రథమ చికిత్స చేసి పెద్దాసుపత్రులకు పంపాల్సింది పోయి. ఇంట్లోనే మల్టీ స్పెషాలిటీ తరహాలో ఆసుపత్రి దుకాణాన్ని తెరిచాడు. ఇతను చేస్తున్న దందాలను తెలుసుకున్న జిల్లా వైద్యాధికారులు, పోలీసులు సహాయంతో రంగంలోకి దిగి ఆర్‌ఎంపీ ఇంటిపై దాడి చేశారు. తన సొంత ఇంట్లోనే హాస్పిటల్, మెడికల్ షాపు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ.లక్షల విలువైన వివిధ రకాల ఔషధాలు, ఇంజెక్షన్లు, ఇతర పరికరాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కరోనా కాలాన్ని అదునుగా చేసుకొని శ్వాస సంబంధించిన పేషంట్స్ కి ఇంట్లోనే ఆక్సిజన్ అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రథమ చికిత్స చేయాల్సిన డాక్టర్ కోవిడ్ చికిత్స, సర్జరీలు కూడా చేస్తున్నాడని జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించి ఆర్ ఎం పి క్లినిక్ ని సీజ్ చేసినట్లు డీఎంహెచ్ఓ అధికారి అనికుమార్ తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Read Also…  కామారెడ్డి జిల్లాలో హృదయవిదాకర ఘటన.. భార్య మృతదేహన్ని భుజంపై మోసుకొని వెళ్లి అంత్యక్రియలు

డెయిరీ ఫామ్‌తో డైలీ ఆదాయం
డెయిరీ ఫామ్‌తో డైలీ ఆదాయం
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..