Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?

కరోనా ఎన్నో పాఠాలు నేర్పుతోంది. ఎందరినో డాక్టర్లుగా చేసిపారేస్తోంది. అవును.. ఎవరికీ తోచిన సలహా అది పని చేస్తుందా? లేదా? దానిలో లాజిక్ ఎంత? ఆ సలహాతో ఒక్కరికన్నా మేలు జరిగిందా? ఇలాంటివి ఏమీ ఆక్కర్లేదు..

Corona: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?
Oxygen Check
Follow us
KVD Varma

|

Updated on: Apr 25, 2021 | 9:11 PM

Corona: కరోనా ఎన్నో పాఠాలు నేర్పుతోంది. ఎందరినో డాక్టర్లుగా చేసిపారేస్తోంది. అవును.. ఎవరికీ తోచిన సలహా అది పని చేస్తుందా? లేదా? దానిలో లాజిక్ ఎంత? ఆ సలహాతో ఒక్కరికన్నా మేలు జరిగిందా? ఇలాంటివి ఏమీ ఆక్కర్లేదు.. ఎందుకంట్, సలహా ఇవ్వడానికి ఖర్చు ఉండదు కదా! ఓ పది నిమిషాలు కూచుని ఓ వాట్సప్ మెసేజ్.. ఓ అరగంట కూచుని ఓ యూట్యూబ్ వీడియో చేసి పారేస్తే చాలు. ఆనక దానిని ఆచరించి ఎవరికీ ఏమైపోయినా ఫర్వాలేదు. ఈ ధోరణి కరోనా మహమ్మారి వచ్చి పడ్డాకా చాలా ఎక్కువగా అయిపొయింది. ఇటీవల ఓ మెసేజ్ వైరల్ అయింది. అందులో కరోనా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఊపిరి తీసుకునే టెస్ట్ చేస్తే చాలని పేర్కొన్నారు.

ఇందులో A మరియు B అనే రెండు పాయింట్లు ఇచ్చారు. మీరు గట్టిగా ఊపిరి తీసుకుని A నుండి B వరకు మీ శ్వాసను ఆపగలిగితే మీరు కరోనా రహితంగా ఉంటారని అందులో చెప్పారు. నిజంగా ఇది ఎంత విచిత్రం చూడండి. టెస్టులలోనే కరోనా జాడ కనిపెట్టలేక నిపుణులు తలపట్టుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటిది ఊపిరి బిగ బెట్టడం ద్వారా కరోనా ఉందొ లేదో చెప్పెస్తామని అంటున్నారంటే దానిని ఏమనాలి? అయితే దురదృష్టవశాత్తూ ఇటువంటివి ప్రజల్లో బాగా వైరల్ అయిపోతున్నాయి. సరే..ఇప్పుడు ఈ వీడియోలో నిజమెంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఓ ఆక్టోజెనెరియన్ ఈ విషయానికి స్వయంగా సమాధానం ఇచ్చారు. ఫహీమ్ అనే వైద్యుడు చెప్పిన విషయాన్ని మీరు వింటే గనుక.. ఆక్సిజన్ స్థాయిని తనిఖీ చేయడానికి వైరల్ అవుతున్న ఈ పద్ధతి నకిలీ. దీనిని ప్రయత్నించడం సరికాదు. “ఈ సందేశం నకిలీ అని ట్వీట్ చేస్తూ హెచ్చరించారు. అస్సలు ప్రయత్నించకండి. ఇది అస్సలు నిజం కాదు. ” అని అయన పేర్కొన్నారు. అలా ఊపిరి బిగ బెడితే కనుక ఆక్సిజన్ అందాల్సినంత శరీరానికి అందక వేరే రకమైన ఇబ్బందులు తలెత్తుతాయి. ఒక్కోసారి గుండెకు..శ్వాస కోశాలకూ ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది. అని ఆయన హెచ్చరించారు.

అలాగే, ఇటీవల ఒక  వీడియో డాక్టర్ అలోక్ నాద్ అనే ఆయన సోషల్ మీడియాలో ఉంచారు.  ఆయన అందులో ఆక్సిజన్ కు ప్రత్యామ్నాయంగా నెబ్యులైజర్ పని చేస్తుందని చెప్పారు. అయితే, ఇది పూర్తిగా తప్పు. ఈ విషయాన్ని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ సోషల్ మీడియాలో ఇది కూడా ఇప్పటికే ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.  “ఒక నెబ్యులైజర్ ఔషధం యొక్క నిహారికలను అందిస్తుంది అలాగే, వాటిని కొంచెం నెట్టివేస్తుంది. ఇది ఆక్సిజన్ అవసరాన్ని తీర్చదు. వాస్తవానికి, కొన్ని సమయాల్లో, మీరు దానిని ఆక్సిజన్‌తో అనుసంధానించాలి ”అని స్కాట్లాండ్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ డాక్టర్ అవిరల్ వట్సా అన్నారు.

Also Read: ‘ప్లీజ్ ! హెల్ప్ !’ ఆక్సిజన్ కొరతను తీర్చాలంటూ ప్రముఖ పారిశ్రామికవేత్తలకు కేజ్రీవాల్ లేఖ

India-US Flights: అమెరికా వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మూడు రెట్లు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సిందే..!