India-US Flights: అమెరికా వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మూడు రెట్లు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సిందే..!

India-US Flights: భారత్‌-అమెరికా మధ్య విమానాలకు భారీగా డిమాండ్‌ పెరిగిపోయింది. సాధారణ రోజుల్లో కంటే ఇప్పుడు అమెరికా వెళ్లడానికి మూడు రేట్లు ఎక్కువ చెల్లించాల్సి...

India-US Flights: అమెరికా వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మూడు రెట్లు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సిందే..!
India Us Flights
Follow us

|

Updated on: Apr 25, 2021 | 8:45 PM

India-US Flights: భారత్‌-అమెరికా మధ్య విమానాలకు భారీగా డిమాండ్‌ పెరిగిపోయింది. సాధారణ రోజుల్లో కంటే ఇప్పుడు అమెరికా వెళ్లడానికి మూడు రేట్లు ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. ఇండియాలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో ప్రయాణాలపై అమెరికా ఆంక్షలు విధించించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆంక్షలు మరింత కఠినతరం మారకముందే అమెరికా వెళ్లాలని అనుకుంటున్న వాళ్ల సంఖ్య భారీగానేఉంది. దీంతో విమానాలకు కూడా డిమాండ్‌ పెరిగిపోయింది.

సాధారణంగా భారత్‌ నుంచి అమెరికాకు టికెట్‌ ధర సగటున రూ.50 వేలు ఉంటుంది. అయితే గత వారంలో మాత్రం ఈ ధరలు సగటున రూ.1.5 లక్షలకు చేరినట్లు విమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న కారణంగా గత గురువారం అమెరికా ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి అమెరికా వెళ్లిపోవాలనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోయింది. అమెరికాతో పాటు జర్మనీ, యూకే, యూఏఈ లాంటి దేశాలు కూడా భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. గత గురువారం అమెరికా లెవల్‌ 4 ప్రయాణ ఆంక్షలు విధించింది. అంటే అమెరికా నుంచి ప్రయాణికులు ఇండియాకు వెళ్లకూడదు. ఈ ఆంక్షలు మరిత కఠినమైతే ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై కూడా నిషేధం విధించే ప్రమాదం ఉండటంతో ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.

కాగా, భారత్‌లో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న దృష్ట్యా భారత ప్రయాణికులపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. భారత్‌ నుంచి విమానాలపై నిషేధం విధించాయి. ఇలా ఒక్కొక్క దేశాలు భారత్‌ ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. ఇక అమెరికా ఆంక్షలు విధించడమే కాకుండా భారత్‌ నుంచి వెళ్లే ప్రయాణికుల విమాన టికెట్‌ ఛార్జీలను అమాంతంగా పెంచేసింది. గతంలో అమెరికాలో తీవ్ర స్థాయిలో ఉన్న కరోనా.. ఇప్పుడు భారత్‌లో విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అన్ని దేశాలు భారత్‌పై దృష్టి సారించాయి. ముందు జాగ్రత్తగా భారత్‌ విమానాలపై నిషేధం విధించాయి.

ఇవీ చదవండి

Coronavirus: కరోనాతో భారత్‌లో పరిస్థితి దారుణంగా ఉంది.. ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో

Johnson & Johnson: జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా టీకాపై నిషేధం ఎత్తివేత.. ప్రకటించిన అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ

భారత్‌లో సెకండ్‌వేవ్‌ కరోనా వ్యాప్తిపై అంతర్జాతీయ మీడియా విశ్లేషణ.. కరోనా వ్యాప్తికి గల కారణాలేంటో తెలిపిన విదేశీ పత్రికలు

Latest Articles
భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 8 ఏ లాంచ్.. రూ.20 వేల తగ్గింపు
భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 8 ఏ లాంచ్.. రూ.20 వేల తగ్గింపు
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఆరేళ్ల బిడ్డను మొసళ్ళకు ఆహారంగా వేసిన తల్లి..!
ఆరేళ్ల బిడ్డను మొసళ్ళకు ఆహారంగా వేసిన తల్లి..!
మరో 2 రోజులు కుండబోత వర్షాలు.. పిడుగులు, ఈదురుగాలులు కూడా..
మరో 2 రోజులు కుండబోత వర్షాలు.. పిడుగులు, ఈదురుగాలులు కూడా..
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. కోవై సరళ..
అరంగేట్రంలోనే 2 వికెట్లు.. బ్యాటర్లకు దడ పుట్టించి ఫాస్ట్ బౌలర్..
అరంగేట్రంలోనే 2 వికెట్లు.. బ్యాటర్లకు దడ పుట్టించి ఫాస్ట్ బౌలర్..
మీరు ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేయగానే అర్థం లేని పోస్ట్‌లు కనిపిస్తాయా?
మీరు ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేయగానే అర్థం లేని పోస్ట్‌లు కనిపిస్తాయా?
తెలంగాణ ఈసెట్‌ 2024 ప్రాథమిక ఆన్సర్‌ 'కీ' విడుదల
తెలంగాణ ఈసెట్‌ 2024 ప్రాథమిక ఆన్సర్‌ 'కీ' విడుదల
దోహా డైమండ్ లీగ్‌లో మరో స్వర్ణంపై కన్నేసిన నీరజ్ చోప్రా
దోహా డైమండ్ లీగ్‌లో మరో స్వర్ణంపై కన్నేసిన నీరజ్ చోప్రా
ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. వాటిలో 53 శాతం ఉద్యోగాలు.
ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్ అంటే ఇది కదా.. వాటిలో 53 శాతం ఉద్యోగాలు.