payal rajput: ‘ఆహా’ కోసం విలన్ గా మారనున్న ఆర్ఎక్స్100 బ్యూటీ … పాయల్ ఫస్ట్ వెబ్ సిరీస్
ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రాళ్లకు నిద్ర దూరం చేసింది అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమా తోనే తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది పాయల్.
payal rajput: ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రాళ్లకు నిద్ర దూరం చేసింది అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమా తోనే తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది పాయల్. ఆతర్వాత వెంకటేష్ నటించిన వెంకీమామ సినిమాలో కనిపించింది. హీరోయిన్ గానే కాకుండా ఆమధ్య స్పెషల్ సాంగ్ మెరిసింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు ఓటీటీ వేదికగా సినిమాలు చేస్తుంది. అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకాడని ఈ ముద్దుగుమ్మ… ఆమధ్య అనగనగా ఒక అతిథి అనే సినిమాలో డీ గ్లామర్ పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. ఆహా లో రిలీజ్ అయిన ఈ సినిమా పర్లేదనిపించుకుంది. ఈ సినిమాలో పాయల్ తో పాటు యువ కథనాయకుడు చైతన్య కృష్ణ, నటులు ఆనంద్ చక్రపాణి, వీణ సుందర్ తదితరలు కీలక పాత్రల్లో నటించారు. దయాల్ పద్మనాభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందింది.
ఇక ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ పాయల్ తో మరో ప్రాజెక్ట్ చేస్తుంది. ఆహా ‘త్రీ రోజెస్’ అనే వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఇందులో పాయల్ నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో చేస్తోందట. ఆమె విలనిజమే ఈ సిరీస్ కి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ వెబ్ సిరీస్ తో నైనా పాయల్ తిరిగి ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :