వెరైటీ పెళ్లి పత్రిక.. కరోనా టైంలో లగ్గం.. కానుకల కోసం క్యూఆర్ కోడ్.. నెట్టింట వైరల్.!

ఓ శుభలేఖ విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందా అని ఆలోచిస్తున్నారా..? భాషకు, యాసకు పట్టం కట్టి…

  • Ravi Kiran
  • Publish Date - 12:16 pm, Fri, 30 April 21
వెరైటీ పెళ్లి పత్రిక.. కరోనా టైంలో లగ్గం.. కానుకల కోసం క్యూఆర్ కోడ్.. నెట్టింట వైరల్.!
Coronawedding

అసలే కరోనా టైం.. ఆపై పెళ్లి ముహూర్తం.. అందులోనూ కొంచెం వెరైటీగా ఉండాలనుకున్నారు ఈ జంట. అనుకున్నదే తడువుగా ఆచరణలో పెట్టారు. తమ పెళ్లి శుభలేఖను వినూత్నంగా రూపొందించారు. భాషకు, యాసకు పట్టం కట్టి… క్రియేటివిటీని జోడించారు. ఇంకేముందు ఈ ఫన్నీ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఇది ఎవరిది అనుకుంటున్నారా.! మరెవరిదో కాదండీ.. ‘మై విలేజ్ షో’ సభ్యుడు అనిల్ జీలాది.

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన అనిల్.. ‘మై విలేజ్ షో’ ద్వారా ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు. మే 1వ తేదీన తన పెళ్లి ఉందని.. అందరూ కూడా పెళ్లిని వీక్షించాలని కోరుతూ.. ‘కరోనాకాలంలో లగ్గ పత్రిక’ అంటూ వినూత్నంగా శుభలేఖను తయారు చేయించుకున్నాడు. కరోనా కాలంలో అతిధులు లేకుండా లగ్గం చేసుకుంటున్నానని.. ఇన్ స్టా లైవ్ లో పెళ్లి వేడుకను చూడొచ్చని పేర్కొన్నాడు. ఆన్ లైన్ లోనే అందరూ ఆశీర్వదించాలని కోరాడు.

పెళ్లయ్యాక ఎవరి ఇళ్లల్లో వారు భోజనాలు చేయాలని.. ఇక పెళ్లికి కానుకలు ఇచ్చేవారి కోసం ప్రత్యేకంగా గూగుల్ పే స్కాన్ కూడా పత్రికలో చేర్చాడు. అటు పెళ్లికి వచ్చిన కట్న, కానుకలను కరోనా కాలంలో తిండి లేకుండా బాధపడుతున్న వారికి ఆర్ధిక సాయంగా అందించబడుతుందని పేర్కొన్నాడు. కాగా, అనిల్ జీలా పెళ్లి పత్రిక తెలంగాణ యాస పదాలతో ముచ్చటేసేలా ఉండటంతో చాలామంది నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అనిల్ పెళ్లి పత్రిక…

Read also: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?

ఈనెల 28 నుంచి జూన్‌ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..

 ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!