Corona Pandemic: కోవిడ్ వార్డులో వైద్య సిబ్బంది భాంగ్రా డ్యాన్స్..కరోనా పేషెంట్ల ఉత్సాహం..ఇంటర్నెట్ లో చూసిన వారికి ఉల్లాసం!

కరోనా బారిన పడిన వారు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తే మానసికంగా పెద్ద శిక్ష. ఎటు చూసినా తమలాంటి కరోనా పేషెంట్స్.. ఒక్కోసారి పక్కనే ప్రాణాలు విడిచి పెట్టేస్తున్నవారు.. కొన్నిసార్లు ఆరోగ్య ఇబ్బందితో వారు చేసే రోదనలు.

Corona Pandemic: కోవిడ్ వార్డులో వైద్య సిబ్బంది భాంగ్రా డ్యాన్స్..కరోనా పేషెంట్ల ఉత్సాహం..ఇంటర్నెట్ లో చూసిన వారికి ఉల్లాసం!
Doctors Dance
Follow us

|

Updated on: Apr 29, 2021 | 5:59 PM

Corona Pandemic: కరోనా బారిన పడిన వారు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తే మానసికంగా పెద్ద శిక్ష. ఎటు చూసినా తమలాంటి కరోనా పేషెంట్స్.. ఒక్కోసారి పక్కనే ప్రాణాలు విడిచి పెట్టేస్తున్నవారు.. కొన్నిసార్లు ఆరోగ్య ఇబ్బందితో వారు చేసే రోదనలు.. అన్నిటిని మించి ఒంటరితనం. ఒక్కసారిగా ప్రపంచంలోంచి చిన్న వైరస్ శరీరంలోకి ప్రవేశించి జీవితాన్ని అల్లకల్లోలం చేసేసింది అనే వ్యధ.. ఇన్ని ఆలోచనల మధ్యలో కరోనా పేషెంట్స్ నిత్యం నరకంలో ఉన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. డాక్టర్లు.. నర్సులు.. మందులు.. అన్నీ సమయానుసారంగా అందుతున్నా.. మానసికంగా తీరని లోటు వెంటాడుతూనే ఉంటుంది. అటువంటి పేషెంట్స్ ని మానసికంగా ఉల్లాసంగా ఉంచడానికి వైద్యులు, వైద్య సిబ్బంది తరచూ పలకరించడం. పరామర్శించడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ, కొంత మందికి మనసులోని లోటు అలానే ఉంటుంది. అటువంటి వారికోసం.. వైద్య సిబ్బంది డ్యాన్సులు చేసిన సందర్భాలు గతంలో చాలా చూశాం. అదేవిధంగా ఇప్పుడు కూడా కరోనా పేషెంట్స్ ని ఉల్లాసంగా ఉంచడానికి పంజాబ్ లోని ఒక కోవిడ్ సెంటర్ లో వైద్య సిబ్బంది చేసిన ప్రయత్నం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఆ వీడియో ఇక్కడ చూడొచ్చు..

వైరల్ వీడియోలో, కోవిడ్-సోకిన రోగులను ఉత్సాహపరిచేందుకు ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు పిపిఇ కిట్లలో నృత్యం చేశారు. వైద్యులు రోగులను తమతో పాటు నృత్యం చేయమని ప్రోత్సహించారు. కొంతమంది రోగులు చప్పట్లు కొట్టారు వారి పడకలపై విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు భాంగ్రా స్టెప్పులతొ అదరగొట్టారు. ఈ వీడియోను బుధవారం గుర్మీత్ చాధా అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. రోగులతో పాటు, పాట మరియు నృత్యం ఇంటర్నెట్లో ఈ హృదయపూర్వక వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులను ఉత్సాహపరిచింది. ఈ వీడియో వైరల్ అయ్యింది, చాలా మంది దీన్ని ఇష్టపడ్డారు, రీట్వీట్ చేశారు. వీడియో ద్వారా పాజిటివిటీ, ఉల్లాసాన్ని వ్యాప్తి చేసినందుకు ప్రజలు ఆరోగ్య కార్యకర్తలను ప్రశంసించారు. నిజమే, దేశంలోని ప్రతి మూలలో ప్రబలంగా ఉన్న భయంకరమైన పరిస్థితుల మధ్య ఈ సమయంలో ఒత్తిడిని తగ్గించడానికి ఇటువంటి తేలికపాటి వీడియోలు అవసరం. అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం తెలిపిన సమాచారం ప్రకారం, భారతదేశం గత 24 గంటల్లో 3,79,257 తాజా కోవిడ్ -19 కేసులు అలాగే, 3,293 మరణాలను నమోదు చేసింది. దేశంలో మొత్తం మరణాలు నిన్న 2,00,000 మార్కును దాటాయి.

Also Read: Jagan on Vaccination: వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌పై కీలక వ్యాఖ్యలు.. ఫిబ్రవరి దాకా సాధ్యం కాదని వ్యాఖ్య

Blood Shortage: కరోనా విజృంభణతో పొంచి ఉన్న మరో ముప్పు… తగ్గుతున్న రక్తం నిల్వలు..!

సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
సామాన్యులకు తక్కువ సమయంలో శ్రీవారి దర్శనం టీటీడీ సరికొత్త ప్లాన్
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3%నికి పెంపు'
షారుక్ కోసం అభిమాని సాహసం..
షారుక్ కోసం అభిమాని సాహసం..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
వరద బాధితులకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ట్రస్ట్ భారీ వితరణ..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
అది కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు సంకేతమట..
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
శ్రీశైలంలో కన్నుల పండువగా కార్తీకలక్షదీపోత్సవం పోటెత్తిన భక్తులు
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
బస్సు టికెట్ చార్జీల పెంపుపై TGSRTC క్లారిటీ.. ఏం చెప్పిందంటే
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
టెట్‌ ఫలితాల్లో అన్ని పేపర్లకు భారీగా తగ్గిన పాస్‌ పర్సెంటైల్
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
అమెరికాలో ఎన్నికలు భారత్‌లో హడావిడి ట్రంప్, కమలా గెలుపు కోసంపూజలు
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..
నిమ్మకాయా మజాకా.. ఆరోగ్యానికి పవర్‌ఫుల్.. డైలీ ఉదయాన్నే..