Tihar Jail: కరోనా సెకండ్ వేవ్.. తీహార్ జైల్లో నలుగురు ఖైదీల మృతి.. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారుల లేఖ

Delhi Tihar Jail: దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాలు కూడా రోజురోజుకూ

Tihar Jail: కరోనా సెకండ్ వేవ్.. తీహార్ జైల్లో నలుగురు ఖైదీల మృతి.. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారుల లేఖ
Tihar Jail
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 30, 2021 | 1:04 PM

Delhi Tihar Jail: దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నిత్యం మూడు వేలమందికి పైగా కరోనా కారణంగా మరణిస్తున్నారు. అయితే.. ఈ కోవిడ్ మహమ్మారి జైళ్లపై కూడా ప్ర‌తాపం చూపుతోంది. ఇప్పటికే దేశంలోని పలు జైళ్ల‌లో ఉన్న ఖైదీలు కూడా క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డుతున్నారు. దీంతో ఆయా జైళ్ల అధికారులు ప్ర‌త్యేక వార్డుల‌ను ఏర్పాటు చేసి క‌రోనా బాధిత ఖైదీల‌కు చికిత్స అందిస్తున్నాయి. ఈ తరుణంలో తీహార్ జైల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంది. కరోనా సెకండ్ వేవ్‌లో నలుగురు ఖైదీలు మరణించగా.. చాలామంది బాధితులుగా మారారని అధికారులు వెల్లడించారు.

ఈ మేరకు తీహార్ జైలు అధికారులు ఢిల్లీ ప్ర‌భుత్వానికి ఓ లేఖ రాశారు. జైల్లో ఖ‌దీల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌టంవ‌ల్ల భౌతిక దూరం అనే నిబంధ‌న‌ను పాటించ‌డం సాధ్యం కావ‌డం లేద‌ని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధ్య‌మైనంత మంది ఖైదీల‌ను పెరోల్‌పై, బెయిల్‌పై పంపించేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ఆ లేఖ‌లో కోరారు. సెకండ్ వేవ్ ప్రభావం బాగా ఉందని అందుకే ఈ లేఖను రాశామని.. పరిశీలనలో ఉందని అధికారులు తెలిపారు.

ఇదిలాఉంటే.. 7 ఏళ్లు శిక్షను పూర్తిచేసిన ఖైదీలను విడుదల చేయాలని బుధవారం ఢిల్లీ హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఢిల్లీలోని జైళ్లల్లో శిక్షను అనుభవిస్తున్న వారిలో.. అత్యవసర వైద్యం అవసరమైన ఖైదీలను విడుదల చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా.. ఇది మే 4 న విచారణకు రానుంది.

Also Read:

Auto Ambulance: ‘కరోనా పరిస్థితులను చూసి ఉండలేకపోయా’.. ఆటోను అంబులెన్స్‌గా మార్చిన డ్రైవర్.. ఉచితంగా సేవలు..