Auto Ambulance: ‘కరోనా పరిస్థితులను చూసి ఉండలేకపోయా’.. ఆటోను అంబులెన్స్‌గా మార్చిన డ్రైవర్.. ఉచితంగా సేవలు..

Free Auto Ambulance: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో ఆక్సిజన్ లేక, సకాలంలో వైద్య సేవలు అందక చాలామంది మరణిస్తున్నారు. ఈ తరుణంలో ఓ ఆటో డ్రైవర్

Auto Ambulance: ‘కరోనా పరిస్థితులను చూసి ఉండలేకపోయా’.. ఆటోను అంబులెన్స్‌గా మార్చిన డ్రైవర్.. ఉచితంగా సేవలు..
Free Auto Ambulance
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 30, 2021 | 12:39 PM

Free Auto Ambulance: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో ఆక్సిజన్ లేక, సకాలంలో వైద్య సేవలు అందక చాలామంది మరణిస్తున్నారు. ఈ తరుణంలో ఓ ఆటో డ్రైవర్ గొప్ప మనస్సును చాటుకున్నాడు. తన ఆటోను అంబులెన్స్‌గా మార్చి, దానిలో ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేసి ఉచితంగా సేవలు అందిస్తున్నాడు. అయితే ఆక్సిజన్ సిలిండర్ నింపడానికి రోజుకు అతను 600రూపాయలు సైతం ఖర్చుచేస్తున్నాడు. కరోనా పరిస్థితులను చూశాక.. ప్రజలకు ఈ సహాయం అందించాలని అనుకున్నానని మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన ఆటో-రిక్షా డ్రైవర్ జావేద్ ఖాన్ తెలిపాడు. గత మూడు రోజుల నుంచి డ్రైవర్ జావేద్ ఖాన్ దాదాపు 10 మందిని సకాలంలో కరోనా బాధితులను ఆసుపత్రులకు తరలించి ప్రాణాలను కాపాడాడు. అంతేకాకుండా ఎవరికైనా అత్యవసరమైతే తనకు ఫోన్ చేయాలంటూ కూడా సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేశాడు. ప్రస్తుతం జావేద్ ఖాన్ చేస్తున్న సేవలను అందరూ సోషల్ మీడియా ద్వారా కొనియాడుతున్నారు.

కోవిడ్ -19 కేసుల పెరుగుదల మధ్య.. ప్రజలు పడుతున్న బాధను చూసి తన ఆటోను అంబులెన్సుగా మార్చి సేవలందిస్తున్నానని జావేద్ ఖాన్ తెలిపాడు. తాను 18 సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నానని.. తన కుటుంబంలో ఎవ్వరికీ కరోనా సోకలేదని పేర్కొన్నాడు. అయినప్పటికీ బయట ఆక్సిజన్ లేక, సకాలంలో ఆసుపత్రికి వెళ్లలేక బాధితులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపాడు. అందుకే వారికోసం ఏదైనా చేయాలనే సంకల్పంతో ఆటోను అంబులెన్సుగా మార్చానని తెలిపాడు. ఈ క్రమంలో తన భార్య గొలుసును తాకట్టు పెట్టి.. ఆటోలో శానిటైజర్లు, కొన్ని మందులు, ఆక్సిజన్ సిలిండర్‌ను ఏర్పాటు చేశానని వెల్లడించాడు. నిరుపేదలకు సాయమందించడమే తన కర్తవ్యమని.. డబ్బు తనకు అవసరం లేదని వెల్లడించాడు. కాగా.. అతని నుంచి సేవలు పొందిన వారు జావేద్ కృషిని కొనియాడుతున్నారు. డబ్బులు ఇస్తున్నా.. తీసుకోలేదంటూ పలువురు పేర్కొన్నారు.

ఆటో అంబులెన్స్..

Also Read:

ఆసుపత్రుల బయటే గంటల తరబడి కోవిడ్ రోగుల పడిగాపులు, బెడ్స్ లేక హాస్పిటల్స్ యాజమాన్యాల కలవరం

India Coronavirus: దేశంలో కరోనా విలయతాండవం.. ఒక్క రోజులో 4లక్షలకు చేరువలో కేసుల నమోదు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే