Tollywood: ఏఐ లుక్ కాదు గురూ! సినిమా కోసం నిజంగానే అన్నీ తీసేశాడు.. ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
రీల్ లైఫ్ లో అయినా, రియల్ లైఫ్ లో అయినా ఈ హీరో ఎక్కువగా గుబురు గడ్డంతోనే కనిపించాడు. అయితే సినిమా కోసం ప్రాణం పెట్టి నటించే ఈ హీరో ఇప్పుడు తన మేకోవర్ పూర్తిగా మార్చుకున్నాడు. సుమారు 8 ఏళ్ల తర్వాత ఇలా నీట్ గా క్లీన్ షేవ్ లో కనిపించాడు.

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో. అలాగనీ ఇతను మరీ ఎక్కువ సినిమాలు చేయలేదు. చేసింది రెండే సినిమాలు అయినా పాన్ ఇండియా ఫేమస్ అయ్యాడు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక సినిమా కోసం ప్రాణం పెట్టి నటించే యాక్టర్లలో ఇతను కూడా ఒకడు. పాత్ర కోసం తనను ఎలాగైనా మార్చుకుంటాడీ హీరో. అందుకే గత 8-9 ఏళ్లుగా గుబురు గడ్డం, మీసాలతో ఒకే లుక్ మెంటైన్ చేస్తూ వచ్చిన ఇతడు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. క్లీన్ షేవ్ తో చాలా కొత్తగా కనిపించాడు. మరి ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు కేజీఎఫ్ ఫేమ్ యశ్. సడెన్ గా చూసి చాలా మంది అతనిని గుర్తు పట్టలేకపోయారు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఒక లుక్ మెయింటైన్ చేస్తున్నాడీ స్టార్ హీరో. రియల్ లైఫ్, రీల్ లైఫ్ లోనూ ఎక్కువగా గుబురు గడ్డంతోనే కనిపించాడు.
టాక్సిక్ మూవీ కోసం ఇప్పుడు క్లీన్ షేవ్ తో కనిపించాడు యశ్. ఇటీవల వచ్చిన ఈ టీజర్ ఆఖరులో ఈ లుక్ ను చూపించారు. చాలా మంది దీనిని చూసి ఏఐతో క్రియేట్ చేశారని నెగెటిట్ కామెంట్స్ చేశారు. కొందరు ట్రోల్స్ కూడా చేశారు.ఇప్పుడు వీటికి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు యశ్ స్టైలిష్. రాకింగ్ స్టార్ క్లీన్ షేవ్ లుక్ వీడియోను తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో షేర్ చేశాడు. ‘నమ్మకం నిజమైనది అయినప్పుడు.. పనే మాట్లాడుతుంది’ అని ట్రోలర్స్ కు కౌంటర్ ఇచ్చాడు సదరు హెయిర్ స్టైలిష్ట్ . ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
వీడియో ఇదిగో..
View this post on Instagram
యశ్ నటించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా మరియు రుక్మిణి వసంత్ హీరోయిన్లు గా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




