India Coronavirus: దేశంలో కరోనా విలయతాండవం.. ఒక్క రోజులో 4లక్షలకు చేరువలో కేసుల నమోదు..

India Covid-19 updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వారం నుంచి నిత్యం లక్షలాది కేసులు, వేలాది సంఖ్యలో

India Coronavirus: దేశంలో కరోనా విలయతాండవం.. ఒక్క రోజులో 4లక్షలకు చేరువలో కేసుల నమోదు..
Coronavirus Updates
Follow us

|

Updated on: Apr 30, 2021 | 9:46 AM

India Covid-19 updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వారం నుంచి నిత్యం లక్షలాది కేసులు, వేలాది సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో గురువారం.. 3,86,452 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 3,498 మంది బాధితులు మరణించారు. తాజాగా నమోదైన కేసుల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,62,976(1.87 కోట్లు) కు పెరగగా.. మరణాల సంఖ్య 2,08,330 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. దేశంలో కరోనా మొదలైన నాటినుంచి.. ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

ఇదిలాఉంటే.. గురువారం కరోనా నుంచి 2,97,540 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,53,84,418 కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 31,70,228 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 81.99 శాతం ఉండగా.. మరణాల రేటు 1.11 శాతం ఉంది.

ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా.. 15,22,45,179 డోసులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మే 1 నుంచి భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

కాగా.. నిన్న దేశవ్యాప్తంగా 19,20,107 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఏప్రిల్ 29 వరకు మొత్తం 28,63,92,086 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ వెల్లడించింది.

Also Read: అప్పుడే కొరత తీవ్రం, సెంటర్లు మూసివేత, ముంబైలో మూడు రోజుల పాటు నో వ్యాక్సిన్ , 

ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!