Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Remdesivir: రెమిడెసివర్‌ ఇంజక్షన్ పేరుతో భారీ మోసం.. ఖాళీ బాటిల్‌లో సెలైన్ వాటర్.. గుట్టరట్టు చేసిన పోలీసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజ‌ృంభిస్తోంది. ఆక్సిజన్ అందక, ఆసుపత్రుల్లో పడకలు దొరక్క ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. మరో వైపు, ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు.

Fake Remdesivir:  రెమిడెసివర్‌ ఇంజక్షన్ పేరుతో భారీ మోసం.. ఖాళీ బాటిల్‌లో సెలైన్ వాటర్.. గుట్టరట్టు చేసిన పోలీసులు
Fake Remdesivir Injection
Follow us
Balaraju Goud

| Edited By: Janardhan Veluru

Updated on: May 11, 2021 | 11:55 AM

Fake Remdesivir injections:  ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజ‌ృంభిస్తోంది. ఆక్సిజన్ అందక, ఆసుపత్రుల్లో పడకలు దొరక్క ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. మరో వైపు, ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. శానిటైజర్ దగ్గర నుంచి రెమిడెసివర్‌ వరకు మొత్తం నకిలీవి తయారు చేస్తున్నారు. ప్రజల్లో భయాందోళనలను వీరికి అనువుగా మార్చుకొని అమాయకులను మాయమాటలతో మోసం చేస్తున్నారు. ప్రాణాలను కాపాడుకోవాలనే అత్రుతలో అడిగినంత డబ్బు కట్టి నకిలీవి కొంటున్నారు. తీరా మోసం జరిగిందని తెలిసి పోలీసులును ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఖాళీ రెమిడెసివర్‌ బాటిల్స్‌లో సెలైన్‌ వాటర్‌ నింపి ఇంజక్షన్లుగా విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

కోవిడ్‌ నుంచి తమ వారిని రక్షించుకునేందుకు బాధిత బంధువులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఆయువు నిలబెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే అదునుగా చేసుకుని కొందరు మోసగాళ్లు క్యాష్‌ చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రంజీత్ కుమార్ అన్నకు కోవిడ్ పాజిటివ్ వ‌చ్చింది. అయితే, న‌గ‌రంలోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆ ఆసుప‌త్రి వైద్యుడు ఆత‌నికి ఆరు రెమిడెసివర్‌ ఇంజెక్షన్లు ఆవ‌సరమని వైద్యులు తెలిపారు. అయితే, ఇందుకు సంబంధించిన రెమ్‌డిసివర్ తమవ‌ద్ద లేవు మీరే తెచ్చుకోవాల‌ని చెప్పారు ఆసుపత్రి సిబ్బంది. దీంతో రంజిత్ కుమార్ త‌న‌కు తెలిసిన వారి వద్ద తీసుకు వ‌స్తాను అని చెప్పాడు. అత‌నికి తెలిసిన మేల్ న‌ర్స్ స‌తీష్ గౌడ్ ను క‌లిశాడు. అయితే, స‌తీశ్ గౌడ్ , ఓ ప్రైవేట్ ఆసుప‌త్రి వైద్యుడు సాయిక్రిష్ణ నాయుడు వ‌ద్ద ఉన్నాయ‌న్న సమాచారంతో వెంట‌నే సాయికృష్ణ డాక్టర్‌ను క‌లిశారు. అయితే, ఒక్కో ఇన్‌జ‌క్షన్ రూ.30వేల చొప్పున మూడు రెమిడెసివర్‌ కు రూ.90 వేలు చెల్లించి తీసుకువెళ్లాడు.

అయితే, వాటిని ప‌రిశీలించిన వైద్యుడు న‌కీలీవ‌ని చెప్పడంతో తిరిగి వాపస్ ఇచ్చేశాడు. అయితే, తీసుకున్న డ‌బ్బులు తిరిగి ఇవ్వాలని కోరారు.. అయితే సాయికృష్ణ త‌న వ‌ద్ద ఇంకా వేరేవీ కూడా ఉన్నాయని చెప్పి మ‌రో రెండు రెమిడెసివర్‌ లు ఇచ్చాడు. అవి కూడా డుప్లీకేట్ అని తేలింది. దీంతో బాధిడుతు రంజీత్ కుమార్ ఒక‌ట‌వ టౌన్ పోలీసుల‌ను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు విచార‌ణ చేపట్టారు. సాయికృష్ణ, స‌తీష్ గౌడ్ ను విచారించారు. వారి వ‌ద్ద నుంచి ఆరు రెమిడెసివర్‌ నకిలీ ఇంజక్షన్లు రిక‌వ‌రి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

Read Also….అప్పుడే కొరత తీవ్రం, సెంటర్లు మూసివేత, ముంబైలో మూడు రోజుల పాటు నో వ్యాక్సిన్ ,