Covid-19 Effect: కరోనా విలయతాండవం.. పోలీసులను బలి తీసుకుంటున్న కరోనా మహమ్మారి.. కోవిడ్‌తో 42 మంది పోలీసులు మృతి

Covid-19 Effect: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇక కరోనా కట్టడిలో తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు సైతం...

Covid-19 Effect: కరోనా విలయతాండవం.. పోలీసులను బలి తీసుకుంటున్న కరోనా మహమ్మారి.. కోవిడ్‌తో 42 మంది పోలీసులు మృతి
Follow us

|

Updated on: Apr 30, 2021 | 12:46 PM

Covid-19 Effect: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇక కరోనా కట్టడిలో తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబాలకు సైతం దూరంగా ఉంటూ విధుల్లో ఉంటూ కరోనా బారిన పడుతున్నారు. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ఈ ఏడాదిలో 42 మంది పోలీసులు కరోనా బారిన పడి మృతి చెందినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈనెల రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగాయి. అయితే మృతి చెందిన 42 మందిలో సుమారు 30 మంది సింగిల్‌డోస్‌, రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నవారున్నారు. ఇక మరి కొందరు 40-49 ఏళ్ల మధ్య వారున్నారు. మృతుల్లో 38 ఏళ్ల వయసున్న అసిస్టెంట్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ కూడా ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పోలీసు శాఖలో కోవిడ్‌ మరణాలు భారీగా పెరిగాయి.

2020 మార్చి, డిసెంబర్‌ మధ్య 35 మంది పోలీసులు కరోనా బారిన పడి ప్రాణాలు వదిలారు. ఈ ఏడాదిలో 44 మంది మరణించారు. ఇప్పటి వరకు పోలీసు శాఖలో వ్యాక్సినేషన్‌లో భాగంగా 90 శాతం మందికి టీకాలు వేసినా.. మరణాలు నమోదయ్యాయి. దీనిపై మధ్యప్రదేశ్‌ డీజీపీ వివేక్‌ మాట్లాడుతూ.. మృతుల్లో చాలా మంది సిబ్బంది కోవిడ్‌ మొదటి, రెండో డోస్‌ టీకా తీసుకున్నవారు ఉన్నారని పేర్కొన్నారు. అయితే ఇలా రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్న కారణంగా కూడా వారి మృతికి కారణంగా చెప్పవచ్చని అన్నారు. విధి నిర్వహణలో ఉంటున్న పోలీసుల అరోగ్య విషయంలో పోలీసు శాఖ నుంచి అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు.

ఇవీ కూడా చదవండి:

SSC, Inter Eaxms: పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలపై హైకోర్టులో విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం

Covid-19 WHO: కరోనాపై సోషల్‌ మీడియాలో ప్రచారాలు.. వాస్తవాలపై క్లారిటీ ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో

Justin Trudeau: భారత్‌కు కెనడా భారీ సాయం .. ప్రకటించిన ఆ దేశ ప్రధాని .. ఎంతంటే..!

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!