Covid-19 WHO: కరోనాపై సోషల్ మీడియాలో ప్రచారాలు.. వాస్తవాలపై క్లారిటీ ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో
Covid-19 WHO: ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. అయితే గతంలో వచ్చినట్లు ఈ సెకండ్‌వేవ్..
Covid-19 WHO: ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. అయితే గతంలో వచ్చినట్లు ఈ సెకండ్‌వేవ్ కరోనాపై రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇలా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై కొందరికి అవగాహన వచ్చినా.. కొందరు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు, దోమలు, ఈగల ద్వారా కరోనా సోకుతుందని రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈగలు, దోమలు, నీళ్ల ద్వారా కరోనా సోకే అవకాశమే లేదని తేల్చి చెబుతోంది డబ్ల్యూహెచ్‌వో. వాటి ద్వారా వైరస్ వ్యాపించవచ్చనే తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇక కొందరు తెలిసీ తెలియకుండా వాటిని షేర్ చేసేస్తున్నారు. మనిషి ప్రతి నిత్యం ఉపయోగించే వాటితో కరోనా సోకుతుందని వస్తున్న పుకార్ల వల్ల భయాందోళనలు కలిగిస్తున్నాయి. అయితే ఇలాంటి ప్రచారాల్లో వాస్తవమెంత? ఏది సరైనదనే దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టత ఇచ్చింది.
వ్యాయామం చేసేటప్పుడు మాస్క్ ధరించడం అవసరమా..?
వ్యాయామం చేసే సమయంలో మాస్కులు పెట్టుకోవడం వల్ల శ్వాస సక్రమంగా తీసుకోలేరు. ఆ సమయంలో వచ్చే చెమట మాస్కులను తడిగా చేసి శ్వాసించే ప్రక్రియకు ఇబ్బందులు కలుగజేస్తుంది. దీంతోపాటు సూక్ష్మ జీవులు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో మాస్కులు తీసి ఒక మీటర్ భౌతిక దూరం పాటించడం మేలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది.
అలాగే ఈత కొడితే కూడా కరోనా వస్తుందని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈత కొట్టే సమయంలో నీటి ద్వారా కరోనా వైరస్ వ్యాపించదు. కేవలం వైరస్ ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తికి వైరస్ సోకే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చింది.
వేడినీటితో స్నానం చేస్తే ప్రయోజనం ఉంటుందా..?
వేడినీటితో స్నానం చేస్తే ప్రయోజనం ఉంటుందా..? దానిపై కూడా స్పష్టత ఇచ్చింది డబ్ల్యూహెచ్‌వో. వేడి నీళ్లతో స్నానం చేసినంత మాత్రన కోవిడ్ రాదనే కరెక్ట్ కాదు. బాగా వేడి ఉన్న నీళ్లతో స్నానం చేయడం మంచిది కాదని చెబుతోంది. ఇక ఈగలు, దోమల ద్వారా వైరస్ సంక్రమిస్తుందనే పుకార్లు వినిపిన్నాయి. దీనిపై కూడా సమాధానం ఇచ్చింది డబ్ల్యూహెచ్‌వో. ఈగలు, దోమల ద్వారా కరోనా వైరస్ సంక్రమిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కేవలం వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఇతరుల శరీరాల్లో వైరస్ వెళ్తుందని పేర్కొంది.
ఇవీ కూడా చదవండి: Justin Trudeau: భారత్‌కు కెనడా భారీ సాయం .. ప్రకటించిన ఆ దేశ ప్రధాని .. ఎంతంటే..!
Coronavirus: కరోనాతో భారత్‌లో పరిస్థితి దారుణంగా ఉంది.. ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో