Covid-19 Second Wave: భారత్ నుంచి త్వరగా వచ్చేయండి.. దేశస్థులకు అలర్ట్ జారీ చేసిన అమెరికా

India Covid-19 Second Wave - US: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ తరుణంలో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. నిత్యం మూడు లక్షలకు పైగా కేసులు

Covid-19 Second Wave: భారత్ నుంచి త్వరగా వచ్చేయండి.. దేశస్థులకు అలర్ట్ జారీ చేసిన అమెరికా
India Us Flights
Follow us

|

Updated on: Apr 29, 2021 | 1:51 PM

India Covid-19 Second Wave – US: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ తరుణంలో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. నిత్యం మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా.. మూడు వేలకు పైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు అమెరికా నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. భారత్ నుంచి వచ్చే విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. అయితే.. తాజాగా అగ్రరాజ్యం అమెరికా తమ పౌరులకు హెచ్చరికలు సైతం జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌కు వెళ్లకూడదని పౌరులకు సూచించింది. భారత్‌లో ఉండటం మంచిదికాదని.. ఇప్పటికే అక్కడ ఉన్నవారు వీలైనంత త్వరగా భారత్ నుంచి బయటపడాలని సూచించింది. అమెరికాకు ప్రతిరోజు ఇండియా నుంచి 14 విమానాలు నేరుగా వస్తున్నాయని సూచనలు చేసింది. దీంతోపాటు యూరప్‌ మీదుగా అమెరికాకు ఇతర సర్వీసులు అందుబాటులో ఉన్నాయని వాటిద్వారా కూడా దేశానికి చేరుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ లెవల్‌ 4 ట్రావెల్‌ అడ్వైజరీ (US travel advisory) లో సూచించింది. భారత్‌లో కోవిడ్ కేసులు భయంకరంగా పెరుగుతున్న దృష్ట్యా ఈ సూచనలు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదిలాఉంటే.. భారత్‌లో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ వారం ప్రారంభంలో విమానాలను రద్దుచేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతోపాటు బ్రిటన్ కూడా ఇండియా నుంచి వచ్చేవారు తప్పనిసరిగా 10 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని ప్రకటించింది. దీంతోపాటు పలు దేశాలు అంతకుముందే భారత్ నుంచి వెళ్లే సర్వీసులపై ఆంక్షలు విధించాయి.

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో బుధవారం భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. కొత్తగా 3,79,257 కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 3,645 మంది బాధితులు మరణించారు. దేశంలో కరోనా విజృంభణ మొదలైన నాటినుంచి.. ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,83,76,524 (1.83 కోట్లు) కు పెరగగా.. మరణాల సంఖ్య 2,04,832 కి చేరింది.

Also Read:

Justin Trudeau: భారత్‌కు కెనడా భారీ సాయం .. ప్రకటించిన ఆ దేశ ప్రధాని .. ఎంతంటే..!

America Population: అగ్రరాజ్యంలో జన విస్ఫోటం.. గత పదేళ్ళలో భారీగా పెరిగిన అమెరికా జనాభా