Russia Help: కరోనాతో అల్లాడుతున్న దేశానికి విదేశాల అపన్నహస్తం.. ర‌ష్యా నుంచి రెండు విమానాల్లో భారీగా వైద్య సామాగ్రి

భారత్‌లో రోగుల తాకిడి పెరుగుతుండ‌టంతో ఆస్పత్రుల్లో ఆక్సిజ‌న్‌తోపాటు, ఇత‌ర వైద్య సదుపాయాలు సరిపడటం లేదు. ఈ నేప‌థ్యంలో పొరుగుదేశాల‌న్నీ భార‌త్‌కు అండగా నిలుస్తున్నాయి.

Russia Help: కరోనాతో అల్లాడుతున్న దేశానికి విదేశాల అపన్నహస్తం.. ర‌ష్యా నుంచి రెండు విమానాల్లో భారీగా వైద్య సామాగ్రి
Medical Equipments Sent By Russia
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 29, 2021 | 10:45 AM

Russia Medical equipment: భారత్‌లో మహమ్మారి కరోనా వైరస్ ఉధృతితో వణికిపోతోంది. నిత్యం మూడు ల‌క్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో దేశంలోని అన్ని ఆస్పత్రుల‌ు క‌రోనా బాధితుల‌తో నిండిపోతున్నాయి. రోగుల తాకిడి పెరుగుతుండ‌టంతో ఆస్పత్రుల్లో ఆక్సిజ‌న్‌తోపాటు, ఇత‌ర వైద్య సదుపాయాలు సరిపడటం లేదు. ఈ నేప‌థ్యంలో పొరుగుదేశాల‌న్నీ భార‌త్‌కు అండగా నిలుస్తున్నాయి. స‌హాయ స‌హ‌కారాలు అందించేందుకు ముందుకొస్తున్నాయి. ఇదే క్రమంగా భారత్ భారీ సాయం అందించాలని మిత్ర దేశం రష్యా నిర్ణయించింది.

తాజాగా ర‌ష్యా రెండు ప్రత్యేక విమానాల్లో భార‌త్‌కు భారీగా వైద్యసామాగ్రిని పంపింది. ర‌ష్యా నుంచి 20 ఆక్సిజ‌న్ కాన్సన్‌ట్రేట‌ర్లు, 75 వెంటిలేట‌ర్లు, 150 బెడ్‌సైడ్ మానిట‌ర్లు, 22 మెట్రిక్ ట‌న్నుల ఔష‌ధాలతో బుధ‌వారం బ‌య‌లుదేరిన రెండు విమానాలు ఈ తెల్లవారుజామున ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాయి. విమానాల నుంచి వైద్య సామాగ్రిని అన్‌లోడ్ చేయించిన అధికారులు అవ‌స‌ర‌మున్న వివిధ ఆస్పత్రుల‌కు చేరేవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also…. Indian Stock Market: ఉదయం నుంచే జోరుమీదున్న దేశీయ మార్కెట్లు.. 600 పాయింట్లు లాభంతో ఎగబాకి సెన్సెక్స్