Indian Stock Market: ఉదయం నుంచే జోరుమీదున్న దేశీయ మార్కెట్లు.. 600 పాయింట్లు లాభంతో ఎగబాకి సెన్సెక్స్

గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంచి దూకుడుతో మొదలయ్యాయి. ఉదయం 9.20 సమయంలో సెన్సెక్స్‌ 600 పాయింట్లు పెరిగి 50,334 వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు పెరిగి 15,036 వద్ద కొనసాగుతున్నాయి.

Indian Stock Market: ఉదయం నుంచే జోరుమీదున్న దేశీయ మార్కెట్లు.. 600 పాయింట్లు లాభంతో ఎగబాకి సెన్సెక్స్
Sensex
Follow us

|

Updated on: Apr 29, 2021 | 11:59 AM

Today Sensex: గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంచి దూకుడుతో మొదలయ్యాయి. ఉదయం 9.20 సమయంలో సెన్సెక్స్‌ 600 పాయింట్లు పెరిగి 50,334 వద్ద, నిఫ్టీ 171 పాయింట్లు పెరిగి 15,036 వద్ద కొనసాగుతున్నాయి. మార్కెట్లు నిన్నటి లాభాల జోరును ఇవాళ కూడా కొనసాగుతుండటంతో మదుపరులు ఉత్సాహంగా కొనుగోళ్లు జరుపుతున్నారు. చెన్నై పెట్రో,ఎస్‌ఐఎస్‌ లిమిటెడ్‌,మోరిపెన్‌ ల్యాబ్స్‌,ఉజ్వాన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌,మంగళూరు రీఫైనాన్స్‌ కంపెనీల షేర్లు భారీగా విలువ పెంచుకోగా.. పనాక బయోటెక్‌, స్పందన స్ఫూర్తి ఫినాన్స్‌,బీఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌,బీఎఫ్‌ యుటిలిటీస్‌,జైన్‌ ఇరిగేషన్‌ షేర్లు కాస్తా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇక, మరోవైపు అన్ని రంగాల సూచీలు ఇవాళ లాభాల్లో కొనసాగుతుండటం విశేషం. నిన్న అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిసినా.. ఈ రోజు ఉదయానికి ఆ దేశంలో ఫ్యూచర్‌ మార్కెట్లు లాభాల్లో ఉండటం మన సూచీలకు బలాన్ని చేకూర్చింది. గురువారం బైడెన్‌ 1.8 ట్రిలియన్ డాలర్ల సోషల్‌ సపోర్ట్‌ ప్లాన్‌ను ప్రకటించడం దీనికి కారణమై ఉంటుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. గురువారం హెచ్‌యూఎల్‌, టైటన్‌, బజాజ్‌ ఆటో, టాటా కాఫీ, అంబుజా సిమెంట్స్‌, లారస్‌ ల్యాబ్స్‌, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, ఎక్సైడ్‌, సిగ్నిటీ టెక్నాలజీస్‌, ఐనాక్స్‌ లీజర్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీలు బోర్డు సమావేశాలు నిర్వహించి త్రైమాసిక ఫలితాలు ప్రకటించనున్నారు.

Read Also….  India Covid-19: దేశంలో కరోనా విలయం.. 30 లక్షలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు.. రికార్డు స్థాయిలో..