Petrol, Diesel price Today: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. కొన్ని నగరాల్లో స్వల్ప మార్పులు..

Petrol, Diesel Rates Today: దేశంలో కొంతకాలం నుంచి నిత్యం పెరిగిన చమురు ధరలకు కొంచెం బ్రేక్ పడింది. దీంతో సామాన్యులకు కొంతమేర ఉపశమనం

Petrol, Diesel price Today: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు.. కొన్ని నగరాల్లో స్వల్ప మార్పులు..
Petrol, Diesel Rates
Follow us

|

Updated on: Apr 29, 2021 | 6:32 AM

Petrol, Diesel Rates Today: దేశంలో కొంతకాలం నుంచి నిత్యం పెరిగిన చమురు ధరలకు కొంచెం బ్రేక్ పడింది. దీంతో సామాన్యులకు కొంతమేర ఉపశమనం లభించినట్లయింది. ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అడ్డు అదుపు లేకుండా పెరిగిన ధరలతో వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోవైపు వంట గ్యాస్ ధరలు రోజుకో తీరుగా పెరగడంతో అందరినుంచి ఆందోళన వ్యక్తమైంది. కొన్ని రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్ ధర ఏకంగా రూ.100 మార్క్ కూడా దాటింది. కారణాలు ఏమైనప్పటికీ.. కొన్ని రోజులుగా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు చోటుచేసుకోవడం లేదు. అన్నిచోట్ల ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాలు మరికొన్ని చోట్లనే ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు..

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.40 ఉండగా, డీజిల్‌ ధర రూ.80.73 గా ఉంది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ.96.83 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.81 గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ ధర రూ.92.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.75 గా ఉంది. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.90.62 ఉండగా, డీజిల్‌ ధర రూ.83.61 గా ఉంది. బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.93.43 ఉండగా, డీజిల్‌ ధర రూ.85.60 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.81 గా ఉంది. డీజిల్‌ ధర రూ.90.29 గా ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్‌ ధర 95.36 ఉండగా.. డీజిల్‌ ధర రూ.89.92 గా ఉంది. విజయనగరంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.95.88 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.89.40 గా ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిన్న పెట్రోల్‌ ధర రూ.93.99 కి ఉండగా.. డీజిల్‌ ధర రూ.88.05 కి చేరింది. వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.57 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.65 ఉంది. కరీంనగర్‌లో పెట్రోల్‌ రూ.93.87 ఉండగా, డీజిల్‌ ధర రూ.87.93గా ఉంది.

Also Read:

Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా పడిపోయిన ధరలు.. మహిళలకు ఇదే మంచి ఛాన్స్..

APPSC Group 1 Mains Result: ఏపీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్‌ ఫలితాలు విడుదల

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో