AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APPSC Group 1 Mains Result: ఏపీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్‌ ఫలితాలు విడుదల

APPSC Group 1 Mains Result:2018లో విడుదలైన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్‌ ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (ఏపీపీఎస్సీ )బుధవారం విడుదల

APPSC Group 1 Mains Result: ఏపీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్‌ ఫలితాలు విడుదల
Subhash Goud
|

Updated on: Apr 28, 2021 | 11:27 PM

Share

APPSC Group 1 Mains Result:2018లో విడుదలైన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్‌ ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (ఏపీపీఎస్సీ )బుధవారం విడుదల చేసింది. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్ ‌(www.psc.ap.gov.in)లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారులు పొందుపర్చారు. అభ్యర్థులకు జూన్‌ 14వ తేదీ నుంచి ముఖాముఖి పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఏపీపీఎస్సీ అధికారులు సూచించారు.

కాగా,2018లో ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేయగా డిసెంబర్,2020లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 9,679 మంది అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు హాజరైనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 41 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇందులో 34 సెంటర్లు ఏపీలో ఉండగా, 7 సెంటర్లు హైదరాబాద్‌లో ఉన్నాయి.

అయితే ఇంటర్వ్యూలకు సంబంధించి ఏపీపీఎస్సీ నుంచి అభ్యర్థులకు వ్యక్తిగత కాల్ లెటర్స్ కూడా అందుతాయి. ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. వయసు, విద్యార్హతలు, స్టడీ సర్టిఫికెట్,రెసిడెన్సీ సర్టిఫికెట్,లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ తదితర సర్టిఫికెట్లు,డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించకపోతే వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.

ఇవీ కూడా చదవండి:

AP Inter Exams: మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేష్

CM YS Jagan: టెన్త్, ఇంటర్ పరీక్షలపై రాద్ధాంతం వద్దు.. ప్రతి విద్యార్థికి భరోసా ఇస్తున్నా.. ఎగ్జామ్స్ నిర్వహిస్తామన్న సీఎం జగన్