AP Corona Cases: ఏపీలో క‌రోనా క‌ల్లోలం.. కొత్తగా 14,669 కేసులు, 71 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త కొనసాగుతోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా ఆందోళ‌న క‌లిగిస్తోంది.

AP Corona Cases: ఏపీలో క‌రోనా క‌ల్లోలం.. కొత్తగా 14,669 కేసులు, 71 మరణాలు
Andhra Pradesh Corona Updates
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 28, 2021 | 6:38 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త కొనసాగుతోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతోంది. మృతుల సంఖ్య కూడా ఆందోళ‌న క‌లిగిస్తోంది. కొత్త‌గా రాష్ట్ర వ్యాప్తంగా 74,681 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వహించగా.. 14,669 మందికి పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తేలింది. కరోనా కార‌ణంగా కొత్త‌గా 71 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధ‌వారం విడుద‌ల చేసిన బులిటెన్ లో వెల్ల‌డించింది. మొత్తం ఇప్పటివరకూ 1,62,17,831 కరోనా టెస్టులు చేయ‌గా, 10,69,544మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్ వెల్ల‌డించారు.

టీకా రిజిస్ట్రేషన్ల వెల్లువ..

కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా 18ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ నమోదు ప్రక్రియ బుధవారం(ఏప్రిల్‌ 28) సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట‌య్యింది. అయితే.. వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం పెద్ద ఎత్తున యువత ఒక్కసారిగా కొవిన్‌ పోర్టల్‌లో లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నించటం వల్ల వెబ్‌సైట్​లో టెక్నిక‌ల్ సమస్యలు తలెత్తాయి. చాలా మందికి ఈ సమస్యలు తలెత్తడంతో వారంతా సామాజిక మాధ్య‌మాల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు. నమోదు ప్రక్రియ అందుబాటులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లో ఈ ప్రాబ్లం తలెత్తింది.

Also Read: మే 5 నుంచి షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేష్

రాష్ట్రంలో ఆక్సిజన్ లోటు లేకుండా చూస్తున్నాం.. 60 కోవిడ్ కేర్ కేంద్రాల ద్వారా చికిత్స అందిస్తున్నాంః ఆళ్ల నాని