Alla Nani: రాష్ట్రంలో ఆక్సిజన్ లోటు లేకుండా చూస్తున్నాం.. 60 కోవిడ్ కేర్ కేంద్రాల ద్వారా చికిత్స అందిస్తున్నాంః ఆళ్ల నాని
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్లనాని తెలిపారు. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని గుర్తుచేశారు.
AP Minister Alla Nani: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్లనాని తెలిపారు. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని గుర్తుచేశారు. కరోనా బాధితుల కోసం 37 వేల వరకు బెడ్స్ పెంచామని ఆయన గుర్తు చేశారు. అవసరానికి తగ్గట్టు ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచినట్లు.. ఎవరూ ఆందోళన చెందాల్సి పని లేదని మంత్రి నాని భరోసా ఇచ్చారు.
ఇవాళ అమరావతిలో జరిగిన మంత్రివర్గ ఉప కమిటీలో కరోనా నియంత్రణ కార్యక్రమాలుపై చర్చించామని మంత్రి నాని తెలిపారు. ఏపీలో మరణాల సంఖ్యను తగ్గేలా చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 కోవిడ్ కేర్ కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ లోటు లేకుండా చూస్తున్నామన్నారు. తీవ్రతను బట్టి మెడిసిన్స్ అందుబాటులో ఉంచామన్న మంత్రి, రెమ్‌డిసివిర్ ఇంజక్షన్ల అక్రమాల నిరోధానికి విజిలెన్స్‌ను వినియోగిస్తున్నామన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని ఆళ్ల నాని మరోసారి స్పష్టం చేశారు. ఇక, రాష్ట్రంలో ఇప్పటివరకు 62 లక్షల మందికిపైగా వ్యాక్సినేషన్ ఇచ్చామని వెల్లడించారు. Read Also… Lungs Health Tips: అసలే కరోనా కాలం.. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం.. ఈ పదార్థాలను అస్సలు తినకండి