India Covid-19: దేశంలో కరోనా విలయం.. 30 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు.. రికార్డు స్థాయిలో..

India Coronavirus updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా

India Covid-19: దేశంలో కరోనా విలయం.. 30 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు.. రికార్డు స్థాయిలో..
India Coronavirus
Follow us

|

Updated on: Apr 29, 2021 | 10:51 AM

India Coronavirus updates: దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యం లక్షలాది కేసులు, వేలాది సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో అంతటా ఆందోళన నెలకొంది. మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో బుధవారం.. 3,79,257 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 3,645 మంది బాధితులు మరణించారు. దేశంలో కరోనా విజృంభణ మొదలైన నాటినుంచి.. ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,83,76,524 (1.83 కోట్లు) కు పెరగగా.. మరణాల సంఖ్య 2,04,832 కి చేరింది.

ఇదిలాఉంటే.. బుధవారం కరోనా నుంచి 2,69,507 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,50,86,878 కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 30,84,814 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా.. నిన్న దేశవ్యాప్తంగా 17,68,190 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఏప్రిల్ 28 వరకు మొత్తం 28,44,71,979 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ వెల్లడించింది.

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. వ్యాక్సినేషన్ ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా.. 15,00,20,648 డోసులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మే 1 నుంచి భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. దీనిలో భాగాంగా బుధవారం నుంచి కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

Also Read:

Bengal Elections Phase-8 Voting LIVE: ప్రశాంతంగా సాగుతోన్న బెంగాల్ చివరి దశ ఓటింగ్.. బారులు తీరిన ఓటర్లు..

Cowin Server: కోవిన్ సర్వర్ డౌన్.. ప్రారంభం కాగానే క్రాష్ అయిన వెబ్‏సైట్.. రిజిస్ట్రేషన్‏కు అడ్డంకులు..

Latest Articles