Telangana Corona: కరోనా బారినపడి తెలంగాణలో మరో 58 మంది మృతి.. కొత్తగా 7,994 పాజిటివ్ కేసులు నమోదు
ఎన్నడూ లేని విధంగా సెకండ్ వేవ్‌లో నమోదవుతున్న పాజిటివ్ కేసులకు తోడు మరణాల సంఖ్య పెరగుతుండటంతో జనం భయాందోళన చెందుతున్నారు.
Telangana Coronavirus: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా సెకండ్ వేవ్‌లో నమోదవుతున్న పాజిటివ్ కేసులకు తోడు మరణాల సంఖ్య పెరగుతుండటంతో జనం భయాందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో నిన్నటితో పోల్చితే కాస్త తగ్గినప్పటికీ, కొత్తగా 7,994 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. బుధవారం కొత్తగా 58 మంది కరోనా బారిన పడి ప్రాణాలను కోల్పోయారు.
మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకు 80,181 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 7,994 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. కాగా నిన్న మరో 4,009 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో కలపుకుని ప్రస్తుతం రాష్ట్రంలో 76,060 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,27,960కు చేరుకుంది. ఇక, మొత్తంగా 3,49,692 మంది కోలుకున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 2,208కు చేరింది. ఇక, ఇప్పటివరకు 1,28,28,763 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది..
ఇక, జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి…
Read Also… Rain Alert: రెయిన్ అలర్ట్.. మరో రెండు రోజులపాటు వర్షాలు.. వాతావరణశాఖ వెల్లడి