Rain Alert: రెయిన్ అలర్ట్.. మరో రెండు రోజులపాటు వర్షాలు.. వాతావరణశాఖ వెల్లడి
Telangana Rain Alert:వేసవి కాలంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరో వైపు అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇప్పటికే
Telangana Rain Alert:వేసవి కాలంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరో వైపు అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇప్పటికే రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు కొన్ని రోజులుగా ఉపశమనం లభిస్తోంది. వారం నుంచి తెలంగాణలో అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో ప్రజలు సేదతీరుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ మరో చల్లని కబురు చెప్పింది. గురువారం, శుక్రవారం కూడా తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి కేరళ మీదుగా కోమరిన్ వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వరుసగా మూడోరోజు బుధవారం కూడా కొన్నిచోట్ల వర్షాలు కురవడంతో వాతావరణం కొంతమేర చల్లబడింది.
కాగా.. బుధవారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. రాగల 48 గంటలలో దక్షిణ, ఉత్తర, తూర్పు, మధ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. కాగా.. గత కొన్నిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో పలుచోట్ల ధాన్యం, మిర్చి పంటలు తడిసిపోయాయి.
Also Read: