కరోనా అంటే భయం వేయడం లేదు.. కానీ ఈ ఫ్యాన్ చూస్తుంటే భయమేస్తుంది.. దయచేసి మార్చండి.. కోవిడ్ రోగి రిక్వెస్ట్..
Corona Patient Request Video: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఏమాత్రం కనికరం చూపించడం లేదు. రోజు రోజూకీ కేసులను
Corona Patient Request Video: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఏమాత్రం కనికరం చూపించడం లేదు. రోజు రోజూకీ కేసులను మరింత పెంచుతూ.. జెట్ స్పీడ్‌గా ఈ మహమ్మారి దూసుకుపోతుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ వైరస్ బారిన పడి ఎంతోమంది ఆసుపత్రులలో ప్రాణాలను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక కరోనాతో ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్లిన మనిషి తిరిగి వస్తాడనే నమ్మకం లేకుండా గడుపుతున్నారు చాలా మంది. ఇదిలా ఉంటే.. ఆసుపత్రులలో కోవిడ్ రోగుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఓవైపు బెడ్స్ లేక.. మరోవైపు ఆక్సిజన్ కోరతతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆసుపత్రిలో చెరి బెడ్ దొరికింది.. అని కరోనాను జయించాలనుకున్నవారికి అక్కడి పరిస్థితులు మరింత భయాన్ని కలుగుజేస్తున్నాయి. హాస్పిటల్ వాతావరణమే కాకుండా…అక్కడి వస్తువులు కూడా రోగులను భయపెట్టిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలోని ఓ ఆసుపత్రిలో సీలింగ్ ఫ్యాన్ మార్చమని కోవిడ్ రోగి ఆసుపత్రి వర్గాలు వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కరోనా కంటే ఈ ఫ్యాన్ చూస్తుంటేనే ఎక్కువ భయంగా ఉందని అతడు రిక్వెస్ట్ చేస్తున్నాడు.
దాదాపు 2 నిమిషాల 17 సెకండ్ల నిడివిగల ఈ వీడియోలో ముందుగా.. అతను అక్కడున్న కరోనా బాధితులను చూపించాడు. ఆ తర్వాత తన బెడ్ పైన ఉన్న ఫ్యాన్ చూపిస్తూ.. నేను చింద్వారా జిల్లాలోని ఓ పెద్ద ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నాను. ఇక్కడ ఉన్న ఫ్యాన్ చూస్తుంటే నాకు భయంగా ఉంది. అది ఎప్పుడు నా మీద పడుతుందో అన్న భయానికి నేను నిద్ర కూడా పోవడం లేదు. దయచేసి ఆసుపత్రి సిబ్బంది ఆ ఫ్యాన్ అయినా మార్చండి.. లేదా నా బెడ్ ఇక్కడి నుంచి మార్చండి అంటూ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు. అలాగే కరోనా కంటే ముందే నన్ను ఈ ఫ్యాన్ చంపేయవచ్చు అని తెలిపాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు .. రకారకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ట్వీట్..
Corona se darr nahi lagta sahab is fan se dar lag raha hai.. covid 19 positive patient in hospital Watsapp post… pic.twitter.com/SswxNT4B9J
— Ibrahim (@CMibrahim_IN) April 26, 2021
Also Read: ఆకస్మాత్తుగా నీరసంగా, అలసటగా ఉంటున్నారా ? అయితే నిర్లక్ష్యం చేయకండి.. కోవిడ్ లక్షణాలు కూడా కావచ్చు ?