India Covid-19: కనికరించని కరోనా.. అంతటా మృత్యుఘోష.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో..

India Coronavirus updates: భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో నిత్యం లక్షలాది కేసులు, వేలాది సంఖ్యలో మరణాలు

India Covid-19: కనికరించని కరోనా.. అంతటా మృత్యుఘోష.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో..
Coronavirus In India
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 29, 2021 | 7:10 AM

India Coronavirus updates: భారత్‌లో కరోనావైరస్ మహమ్మారి అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో నిత్యం లక్షలాది కేసులు, వేలాది సంఖ్యలో మరణాలు సంభవిస్తుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. గత కొన్ని రోజుల నుంచి రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. మంగళవారం.. మంగళవారం దేశవ్యాప్తంగా 3,60,960 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 3,293 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఈ సంఖ్య భారీగా పెరిగింది. బుధవారం కూడా రికార్డు స్థాయిని దాటి కేసులు, మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3,79,164 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు 3,646 మంది బాధితులు కరోనా కారణంగా మరణించారు. దేశంలో కరోనా విజృంభణ మొదలైన నాటినుంచి.. ఇన్ని కేసులు, మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. అయితే మే ప్రారంభానికి ముందే ఇన్ని కేసులు, మరణాలు నమోదవుతుండటంతో అంతటా భయాందళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది.

కాగా.. నిన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మంగళవారం నమోదైన కొత్త కరోనా మరణాల్లో 78.53శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ సహా పది రాష్ట్రాల్లోనే అత్యధికంగా ఉన్నాయి. మహారాష్ట్రలో గరిష్ఠంగా 895 మంది, ఢిల్లీలో 381, ఉత్తరప్రదేశ్‌లో 264, ఛత్తీస్‌గఢ్‌లో 246, కర్ణాటక 180, గుజరాత్‌ 170, ఝార్ఖండ్‌ 131, రాజస్థాన్‌లో 121, పంజాబ్‌లో 100 మంది మృతి చెందారు. దీంతోపాటు కొత్తగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర.. ఆతర్వాత ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, గుజరాత్‌, రాజస్థాన్‌ల్లో నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది. ఇదిలాఉంటే.. కేసులతోపాటు.. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా దేశంలో వేగవంతంగా కొనసాగుతోంది. కరోనా కట్టడికి మే 1నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు.

Also Read:

దేశంలో కోవిడ్ సంక్షోభం, సాయానికి రష్యా సిధ్దం, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు

Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా పడిపోయిన ధరలు.. మహిళలకు ఇదే మంచి ఛాన్స్..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.