AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కోవిడ్ సంక్షోభం, సాయానికి రష్యా సిధ్దం, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు

కోవిడ్ పై పోరులో భారత ప్రభుత్వానికి సాయం చేస్తామని హామీ ఇచ్చిన  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

దేశంలో కోవిడ్ సంక్షోభం, సాయానికి రష్యా సిధ్దం, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు
Pm Modi Thanks To Russia President
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Apr 28, 2021 | 11:22 PM

Share

కోవిడ్ పై పోరులో భారత ప్రభుత్వానికి సాయం చేస్తామని హామీ ఇచ్చిన  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తామిద్దరూ బుధవారం ఫోన్ లో చాలాసేపు మాట్లాడామని, ఇండియాలో కోవిడ్ పరిస్థితి గురించి ప్రధానంగా చర్చించామని ఆయన పేర్కొన్నారు. ఈ మహమ్మారిపై జరిపే పోరాటంలో తాము పూర్తిగా సహకరిస్తామని పుతిన్ గట్టి భరోసా ఇచ్చ్చారని మోదీ ట్వీట్ చేశారు. ఇంకా అంతరిక్ష పరిశోధనలు, ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం వంటివాటిపై కూడా తాము చర్చించామని ఆయన తెలిపారు. ఈ పాండమిక్ సమయంలో తమ దేశ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ ని ఇండియాకు అందజేస్తామని పుతిన్ చెప్పారన్నారు. భారత, రష్యా దేశాల విదేశాంగ, రక్షణ శాఖల మంత్రులు ఇకపై ముఖాముఖి చర్చలు జరుపుతారని,  రెండు దేశాల మధ్య వివిధ రంగాలలో సహకారానికి తీసుకోవలసిన చర్యలపై చర్చిస్తారని మోదీ వివరించారు.

రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ మే నెల నుంచి ఇండియాలో లభ్యం కానుంది. దీని ట్రయల్ పై రష్యా  ఆయా దేశాలతో ఎలాంటి సమాచారాన్ని షేర్ చేసుకోకపోవడంతో దీని సామర్థ్యంపై సందేహాలు వెల్లువెత్తాయి.  అయితే లాన్సెట్ సంస్థ తన జర్నల్ లో ఇది సురక్షితమైనదని, సామర్థ్యం కలిగినదని స్పష్టం చేసింది. దీంతో ఈ టీకామందుపై అనుమానాలు తొలగిపోయాయి. ఇప్పటికే ఇండియాలో కోవిషీల్డ్, కొవాగ్జిన్   టీకామందులు అందుబాటులో ఉండగా ఈ వ్యాక్సిన్ కూడా త్వరలో అందుబాటులోకి  రానుంది. మరో వైపు మూడో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం మే 1 నుంచి చేపట్టనుంది. దీంతో కోవిద్ కోవిద్ పరిస్థితిని అదుపు చేయగలమని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలాకు ‘వై’ కేటగిరీ సెక్యూరిటీ, హోమ్ శాఖ తాజా ఆదేశాలు

Maharashtra: మహారాష్ట్రలో మరో 15 రోజులు లాక్‌డౌన్ తరహా ఆంక్షలు: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి