సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలాకు ‘వై’ కేటగిరీ సెక్యూరిటీ, హోమ్ శాఖ తాజా ఆదేశాలు

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలాకు ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ సెక్యూరిటీ కింద 11 మంది భద్రతా సిబ్బంది ఉంటారు.

సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలాకు 'వై' కేటగిరీ సెక్యూరిటీ, హోమ్ శాఖ  తాజా ఆదేశాలు
Ceo Adar Poonawalla
Follow us

| Edited By: Phani CH

Updated on: Apr 28, 2021 | 11:17 PM

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలాకు ప్రభుత్వం వై కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ సెక్యూరిటీ కింద 11 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. వీరిలో ఒకరిద్దరు కమెండోలు కూడా ఉంటారు. తన వ్యాక్సిన్ ధర విషయంలో ఆదార్ తీసుకున్న నిర్ణయంపై పలు విపక్షాలు మండిపడ్డాయి. ఇది అత్యధికంగా ఉందని, వన్ వ్యాక్సిన్, వన్ ప్రైస్ ఉండాలని డిమాండ్ చేశాయి. ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ప్రభుత్వానికి గట్టి మద్దతుదారైనందున ఆయన  కేంద్రానికి తక్కువ ధరకు వ్యాక్సిన్ విక్రయిస్తున్నారని పరోక్షంగా ఈ  ఆరోపణల్లో కొందరు  దుయ్యబట్టారు. తమ టీకామందు డోసు 400 రూపాయలకు అమ్ముతామని ఆదార్ పూనావాలా  ప్రకటించారు. అయితే తాజాగా ఈ ధరను డోసు 300 రూపాయలుగా నిర్ణయించినట్టు ఆయన ట్వీట్ చేశారు. ఇది 25 శాతం తగ్గించినట్టు అని ఆయన  వివరించారు. కాగా  కేంద్రానికి తాము తగ్గించిన ధర (150 రూపాయలు) పరిమిత కాలానికి మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. నిజానికి సగటు ధర 1500 రూపాయలని, కానీ మోదీ ప్రభుత్వ అభ్యర్థనపై తాము సబ్సిడీ రేటుకు ఇస్తున్నామని  చెప్పారు.  వ్యాక్సిన్ పేరు చెప్పి లాభాలు  ఆర్జించాలన్నది తమ ఉద్దేశం కాదన్నారు. మరీ సూపర్ ప్రాఫిట్స్ ను మేం కోరడం లేదు అన్నారాయన. ఏది ఏమైనా తాము డోసు 300 రూపాయలుగా నిర్ణయించామని, ఇది తక్షణమే అమలులోకి వస్తుందని పూనావాలా  తెలిపారు.

కాగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ గురించి ప్రస్తావించకుండా అమెరికా నిపుణుడు, వైట్ హౌస్ లో మెడికల్ చీఫ్ ఫాసీ.. కొవాగ్జిన్ టీకామందుకు కోవిద్ శక్తిని తగ్గించే సత్తా ఉందని చెప్పడం విశేషం.   హైదరాబాద్ లోని భారత్ బయో టెక్ సంస్థ ఈ వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేస్తోంది. మున్ముందు దీన్ని కోటి డోసులకు పెంచాలన్నది ఈ సంస్థ లక్ష్యమట.

మరిన్ని ఇక్కడ చూడండి: Maharashtra: మహారాష్ట్రలో మరో 15 రోజులు లాక్‌డౌన్ తరహా ఆంక్షలు: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

దంతాల నొప్పి, నోటి దుర్వాసనని ఇలా పోగొట్టుకోండి..

Latest Articles
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు..
ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు..
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఏడుగురు దుర్మరణం..
హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఏడుగురు దుర్మరణం..
మరో సూపర్ కారు రిలీజ్ చేసిన రెనాల్ట్..ఆకట్టుకుంటున్న టాప్ ఫీచర్స్
మరో సూపర్ కారు రిలీజ్ చేసిన రెనాల్ట్..ఆకట్టుకుంటున్న టాప్ ఫీచర్స్