Assam Earthquake: వరుస భూకంపాలతో చిగురుటాకులా వణికిపోతున్న అస్సాం.. మళ్లీ ఆరుసార్లు ప్రకంపనలు..

Earthquake in Assam: భూకంపాలతో ఈశాన్య రాష్ట్రం అస్సాం చిగురుటాకులా వణికిపోతోంది. రెండు రోజులుగా వరుసగా సంభవిస్తున్న భూకంపాలతో

Assam Earthquake: వరుస భూకంపాలతో చిగురుటాకులా వణికిపోతున్న అస్సాం.. మళ్లీ ఆరుసార్లు ప్రకంపనలు..
Earthquake In Assam
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 29, 2021 | 7:55 AM

Earthquake in Assam: భూకంపాలతో ఈశాన్య రాష్ట్రం అస్సాం చిగురుటాకులా వణికిపోతోంది. రెండు రోజులుగా వరుసగా సంభవిస్తున్న భూకంపాలతో అస్సాం ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 13 సార్లు భూప్రకంపనలు సంభవించాయి. తాజాగా బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం 2.30 గంటల వరకు వరుసగా సోనిత్‌పూర్‌లో ఆరుసార్లు భూప్రకంపనలు సంభవించాయని అధికారులు పేర్కొన్నారు. కాగా స్వల్పంగా ప్రకంపనలు రావడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. దీంతో ప్రజలంతా ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. వరుస భూకంపాలతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వారంతా నిద్రపోకుండా జాగరం చేస్తూ గడిపారు.

అర్ధరాత్రి మొదట 12.02 గంటల ప్రాంతంలో 2.6 తీవ్రతతో భూమి కంపించింది. తేజ్‌పూర్‌కు 18 కిలోమీటర్ల దూరంలో, 18 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. ఆ తర్వాత 1.10 గంటలకు 2.6 తీవ్రతతో, 1.20 గంటలకు 4.6 తీవ్రతతో, 1.41 గంటలకు మరోసారి 2.3, 1.52 గంటలకు 2.7 తీవ్రతతో స్వల్ప ప్రకంపనలు రికార్డయ్యాయి. చివరి సారిగా 2.38 గంటలకు 2.7 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ పేర్కొంది.

ఇదిలాఉంటే.. అస్సాంలో మొదటగా.. బుధవారం ఉదయం 7.51 గంటలకు 6.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. సోనిత్‌పూర్‌ జిల్లా ప్రధాన కేంద్రమైన తేజ్‌పూర్‌లో భూకంపం సంభవించగా.. బెంగాల్‌లో తదితర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఈ భారీ భూకంపంతో పలుచోట్ల భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇద్దరు మరణించారు. 10 మందికిపైగా గాయపడ్డారు.

Also Read:

కరోనా అంటే భయం వేయడం లేదు.. కానీ ఈ ఫ్యాన్ చూస్తుంటే భయమేస్తుంది.. దయచేసి మార్చండి.. కోవిడ్ రోగి రిక్వెస్ట్..

India Covid-19: కనికరించని కరోనా.. అంతటా మృత్యుఘోష.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు