America on Terrorism: అగ్రరాజ్యానికి అదే టెన్షన్ .. 2 దశాబ్ధాలైనా అదే కలవరం

పేరుకు అగ్రరాజ్యం అయినా అమెరికా ఇప్పటికీ ఉగ్రవాదులు అంటే ఉగ్రవాద సంస్థలు అంటే ఉలిక్కి పడుతూనే ఉంది 2001 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాను...

America on Terrorism: అగ్రరాజ్యానికి అదే టెన్షన్ .. 2 దశాబ్ధాలైనా అదే కలవరం
Us
Follow us
Rajesh Sharma

|

Updated on: Apr 29, 2021 | 4:47 PM

America on Terrorism still worrying:  పేరుకు అగ్రరాజ్యం అయినా అమెరికా (AMERICA) ఇప్పటికీ ఉగ్రవాదులు (TERRORISTS) అంటే.. ఉగ్రవాద సంస్థలు (TERRORIST ORGANISATIONS) అంటే ఉలిక్కి పడుతూనే ఉంది. 2001 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాను సవాల్ చేస్తూ న్యూయార్క్ (NEWYORK) ట్విన్ టవర్స్ (TWIN TOWERS) మీద అల్ కయిదా (AL-QAIDA) తీవ్రవాదులు దాడికి తెగబడిన నాటి నుంచి అమెరికాకు ఉగ్రవాదం అంటే వెన్నులో వణుకు కొనసాగుతోంది. ప్రపంచ పటం మీద ఉగ్రవాదం అనేది లేకుండా చేస్తామంటూ ఆఫ్ఘానిస్తాన్ కేంద్రంగా నాటో దళాలకు (NATO MILITARY TROOPS) సారధ్యం వహిస్తూ అమెరికా సాగించిన హింసాకాండ అంతా ఇంతా కాదు. సుదీర్ఘకాలంపాటు ఉగ్రవాదం అంతానికి అమెరికా కంకణం కట్టుకొని ప్రయత్నం చేసిన తర్వాత కూడా తాజాగా అమెరికా అధ్యక్షుడు (AMERICAN PRESIDENT) మరోసారి ఉగ్రవాదం అంటే ఉలిక్కి పడుతున్నాం అనే రకంగా మాట్లాడారు.

అమెరికన్ కాంగ్రెస్‌ (US CONGRESS) నుద్దేశించి తొలిసారి ప్రసంగించిన అధ్యక్షుడు బైడెన్ (BIDEN) ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ఘానిస్తాన్ (AFGHANISTAN) నుంచి అమెరికా సేనలు వెనక్కి తరలిస్తున్నామని ప్రకటిస్తూనే అమెరికా.. తమ  దేశంలో వేళ్ళూనుకుంటున్న ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘానిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద నిర్మూలనకు జరిగిన ప్రయత్నం విజయవంతం అయ్యిందని ప్రకటించుకున్న బైడెన్.. ఉగ్రవాద సంస్థలు చిన్న చిన్నవిగా విడిపోయి ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించాయని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికన్ ఇంటెలిజెన్స్ (AMERICAN INTELLIGENCE) వర్గాల సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని అమెరికా అంతర్గత భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించారు. పలు దొంగ దారులలో అమెరికాలోకి ఎంటరైన విచ్ఛిన్నకర శక్తులు తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులుగా మారి తనపై దాడికి తెగబడ్డారని భయాందోళన వ్యక్తం చేశారు.  అమెరికాలో మళ్లీ పెరిగిపోతున్న శ్వేత జాత్యహంకారం దేశానికి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలంతా రంగు, జాతి అనే అభిప్రాయాలు పక్కనపెట్టి ఒక్కతాటిపై నిలిస్తేనే అమెరికా అగ్రరాజ్యం అనే హోదాని నిలబెట్టు కుంటుందని అమెరికా అధ్యక్షుడు దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 2021 జనవరి ఆరవ తేదీన వైట్ హౌస్‌పై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా పరిగణించారు. ఇది అమెరికా ప్రజాస్వామ్యానికి పరీక్షగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా అమెరికా దేశంలో ప్రజాస్వామ్యానికి మచ్చ రాకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ALSO READ: ఢిల్లీపై పెత్తనం కేంద్రానిదే.. కొత్త చట్టంతో రాజుకుంటున్న రాజకీయ రగడ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు