Swimming in Sky: ఆకాశంలో ఈత కొట్టాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం లండన్ బయలుదేరండి..ఆలోపు ఈ విశేషాలు చూడండి..
నిషి అనే వాడికి సరదా కోరికలకు లోటు ఉండదు. రకరకాల సరదాల కోసం.. అందులో కొత్తదనం కోసం ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాడు మానవుడు.
Swimming in Sky: మనిషి అనే వాడికి సరదా కోరికలకు లోటు ఉండదు. రకరకాల సరదాల కోసం.. అందులో కొత్తదనం కోసం ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాడు మానవుడు. చాలా మందికి ఈత సరదా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడం చాలా మందికి మజా ఇస్తుంది. ఈత తో ఆరోగ్యమూ బావుంటుందని చెబుతారు. అందుకే వ్యాయామం కోసమూ ఈత కొలనులో తెగ ఈత కొట్టేస్తుంటారు. సరే.. సాధారణంగా ఈత కొలనులు నేలమీదే ఉంటాయి. కానీ, మీకు ఎపుడన్నా ఆకాశంలో ఈత కొట్టాలనిపించిందా? కనీసం అలా ఎవరైనా ఈత కొడితే చూడాలని ఉందా? ఆకాశంలో ఈత ఏమిటండీ బాబూ అనకండి.. ఆ అవకాశం ఉంది. ఎక్కడంటే.. లండన్ లో.. దాని విశేషాలు చూడండి..
లండన్ లో రెండు ఎత్తైన భవనాల మధ్య.. భూమికి 115 అడుగుల ఎత్తులో నిర్మించిన స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతుంటే.. ఆకాశంలో ఈదుతున్నట్లే ఉంటుంది. అయితే, ఇందులో ఈత కొట్టాలంటే.. గుండె ధైర్యం కూడా ముఖ్యం. రెండు అంతస్తుల మధ్య వేలాడుతున్నట్లుగా కనిపించే ఈ ‘స్కై పూల్’ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. ఈత కొడుతూ కింద ఉండే జనాలను చూడవచ్చు. అలాగే, కింద నడిచేవాళ్లకు పైన స్కైపూల్‌లో ఈత కొట్టేవాళ్లు కూడా కనిపిస్తారు. మొత్తం 25 మీటర్ల పొడవుండే ఈ స్విమ్మింగ్‌పూల్‌ను హాల్(HAL) ఆర్కిటెక్ట్స్ డిజైన్ చేశారు. దీన్ని యాక్రిలిక్ అనే మెటీరియల్‌తో తయారు చేశారు. ఇది సుమారు 148,000 గ్లాలాన్ల నీటిని మోయగలదు. ఈ ‘స్కై పూల్’ను ఎంబసీ గార్డెన్స్‌లో గల నైన్ ఎల్మ్స్, బాటర్సీ పవర్ స్టేషన్ రీజనరేషన్ జోన్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఏడాది.. మే 19వ తేదీ నుంచి ఈ స్విమ్మింగ్‌పూల్ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ స్విమ్మింగ్‌పూల్ నుంచి యూకే పార్లమెంట్, లండన్ ఐ, లండన్ సిటీ స్కైలైన్‌లను చూడవచ్చు. 10 అంతస్తుల భవనాల మధ్య స్విమ్మింగ్‌పూల్ నిర్మించడమంటే మాటలు కాదు. ఇందుకు ఇంజినీర్లు, వర్కర్లు ఎంతో శ్రమించారు. ఆశ్చర్యం కలిగించే స్విమ్మింగ్‌పూల్ చిత్రాలను ఇక్కడ చూడండి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram