AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Marriage: ‘మా నాన్నకు పెళ్లి’ చేశాను..అందరూ ఆశీర్వదించండి..తండ్రి పెళ్లి ఫోటో పోస్ట్ చేసిన కూతురు!

సుహాసిని హీరోయిన్ గా చాలా కాలం క్రితం ఓ సినిమా వచ్చింది. స్వాతి ఆ సినిమా పేరు. ఆ సినిమాలో తన తల్లికి పెళ్లి చేస్తుంది సుహాసిని.

Marriage: 'మా నాన్నకు పెళ్లి' చేశాను..అందరూ ఆశీర్వదించండి..తండ్రి పెళ్లి ఫోటో పోస్ట్ చేసిన కూతురు!
Mothers Marriage
KVD Varma
|

Updated on: Apr 29, 2021 | 11:53 PM

Share

Marriage: సుహాసిని హీరోయిన్ గా చాలా కాలం క్రితం ఓ సినిమా వచ్చింది. స్వాతి ఆ సినిమా పేరు. ఆ సినిమాలో తన తల్లికి పెళ్లి చేస్తుంది సుహాసిని. తరువాత ఇదే రకమైన సినిమా పాత్రలు తిరగేసి మా నాన్నకు పెళ్లి అని ఒక సినిమా వచ్చింది. అందులో హీరో శ్రీకాంత్ తన తండ్రికి పెళ్లి చేస్తాడు. పెళ్లి అంటే ఈ రెండు సినిమాల్లోనూ మంచి నిర్వచనం ఇచ్చారు. చరమాంకంలో పెళ్లి ఏమిటి అనే దానికి చక్కని సమాధానం చెబుతారు ఈ సినిమాల్లో. మన జీవన పయనంలో వైవాహిక బంధానికి ఉన్న విశిష్టత మరిదేనికీ ఉండదు. ఎందుకంటే.. అది ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని చేసుకునే బాస. దురదృష్టవశాత్తూ ఆ ఇరువురిలో ఒకరు మరణిస్తే.. రెండో వారు అలా మిగిలిన జీవితం అంతా తోడులేకుండా ఉండిపోవాల్సిందేనా? అందులోనూ మహిళలు అలా ఏ తోడూ లేకుండా ఒంటరిగా జీవన పయనం సాగించాల్సిందేనా? మన ఛాందస వాదులు ఏమి చెప్పినా.. ఇప్పటి యువత మాత్రం అలా కాదు అంటోంది. తమ తల్లి దండ్రుల్లో ఒకరిని కోల్పోతే తల్లి లేదా తండ్రి ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదంటోంది. మరో పెళ్లి తప్పుకాదు అంటోంది. దానికి వయసుతో సంబంధం లేదు అంటోంది. అవును.. పెళ్ళంటే శృంగారం కాదు.. ఒకరికి ఒకరు తోడుగా జీవించే ఒక ఆశ. అందుకే ఇప్పుడు పిల్లలు తమ తల్లి లేదా తండ్రికి మారు మనువు చేయడానికి వెనుకాడటం లేదు. అటువంటిదే ఈ కథనం.

తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. భార్య చనిపోయిన 71 ఏళ్ల వృద్ధుడు.. ఓ వితంతు మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి వివాహ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోను సదరు వృద్ధుడి కుమార్తె షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెకు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆ వృద్ధుడి భార్య ఐదేళ్ల క్రితం మరణించింది. అప్పటి నుంచీ ఆయన ఒంటరిగానే జీవిస్తున్నాడు. దీంతో ఆ వృద్ధుని కుమార్తె ఆయనను చాలా సార్లు కోరింది. మొదట్లో దాటవేస్తూ వచ్చిన సదరు వృద్ధుడు చివరకు ఐదు సంవత్సరాల తర్వాత రెండో వివాహానికి అంగీకరించాడు. మరో వితంతు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 27న వీరి వివాహం జరిగింది.

ఈ సందర్భంగా అదితి తన తండ్రి రెండో వివాహానికి సంబంధించిన ఫోటో షేర్‌ చేస్తూ.. ‘‘ఇది చాలా క్లిష్టమైన అంశం. పునర్విహానికి సంబంధించి మన దేశంలో నిర్దుష్ట చట్టాలు ఏం లేవు. కొందరు మహిళలు మా నాన్న వెంట పడి డబ్బు కోసం దెయ్యాలాగా పీడించడం చూశాను. చివరకు ఆయన పునర్వివాహం చేసుకున్నారు. సమాజం వారిని ఆశీర్వదించి.. అక్కున చేర్చుకుంటుందా.. లేదా అనేది తెలియదు. కానీ నా తండ్రి ఒంటరిగా ఉండటం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు’’ అంటూ ట్వీట్‌ చేసింది.

దీనిపై నెటిజనలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘చివరి దశలో ఉన్నప్పుడు తోడు చాలా అవసరం. మీరు చాలా మంచి పని చేశారు. కంగ్రాట్స్‌’’.. ‘‘ఇంత మంచి న్యూస్‌ షేర్‌ చేసినందుకు ధన్యవాదాలు’’.. ‘‘కొత్త​ ఇంటికి మీ అమ్మను ఆహ్వానించండి. వారిద్దరు ఒకరికొకరు కొత్త జీవితాన్ని ఇచ్చుకున్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రకారం వివాహం అంటే కేవలం శృంగారం మాత్రమే కాదు.. అంతకు మించి ఎంతో విలువైనది. వీరిద్దరు ఒకరినొకరు చూసుకుంటారు.. తోడు, నీడగా నిలుస్తారు’’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజనులు.

ఈ ఫోటో పై వచ్చిన కామెంట్స్..