అమెరికా నుంచి అందిన తొలి ‘కోవిడ్ సాయం’, ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన యూఎస్ విమానాలు

అమెరికా నుంచి ఇండియాకు తొలి 'కోవిడ్ సాయం' అందింది. 400 కి పైగా ఆక్సిజన్ సిలిండర్లు, పది లక్షల రాపిడ్ కరోనా వైరస్  టెస్ట్ పరికరాలు, ఇతర ఆసుపత్రి ఈక్విప్ మెంట్ తో కూడిన సూపర్ గెలాక్సీ...

అమెరికా నుంచి అందిన తొలి 'కోవిడ్ సాయం', ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన యూఎస్ విమానాలు
First Emergency Covid Relief Supplies From Us Arrives
Follow us

| Edited By: Phani CH

Updated on: Apr 30, 2021 | 1:39 PM

అమెరికా నుంచి ఇండియాకు తొలి ‘కోవిడ్ సాయం’ అందింది. 400 కి పైగా ఆక్సిజన్ సిలిండర్లు, పది లక్షల రాపిడ్ కరోనా వైరస్  టెస్ట్ పరికరాలు, ఇతర ఆసుపత్రి ఈక్విప్ మెంట్ తో కూడిన సూపర్ గెలాక్సీ ట్రాన్స్ పోర్ట్ విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.  ‘.కోవిడ్ 19 రిలీఫ్ షిప్ మెంట్ ఫ్రమ్  ది యునైటెడ్ స్టేట్స్ ఎరైవ్డ్ ఇన్ ఇండియా ..బిల్డింగ్ ఆన్ ఓవర్ 70 ఇయర్స్ ఆఫ్ కో-ఆపరేషన్’ అని అమెరికా ట్వీట్ చేసింది.  70 ఏళ్ళ మన ఉభయ దేశాల సహకారానికి ఇది నిదర్శనమని పేర్కొంది. కోవిడ్ పై పోరులో ఇండియాకు బాసటగా ఉంటామని కూడా స్పష్టం చేసింది. వచ్చే వారం అమెరికా నుంచి సాయంతో కూడిన మరిన్ని  విమానాలు రానున్నాయి. ఇక అమెరికాతో బాటు పలు దేశాలు ఈ క్లిష్ట సమయంలో ఇండియాకు సాయం చేస్తామని ప్రకటించాయి. జపాన్ నుంచి 300 ఆక్సిజన్ జనరేటర్లు, 300 వెంటిలేటర్లను పంపుతున్నట్టు ఇండియాలో ఆ దేశ రాయబారి సతోషీ సుజుకీ తెలిపారు. త్వరలో మరింత సాయం అందుతుందన్నారు. ఐర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, హాంకాంగ్, బంగ్లాదేశ్ వంటి దేశాలు కూడా సహాయానికి సిద్ధంగా ఉన్నాయి. అమెరికా హూస్టన్ లోని ఇండియన్ అమెరికన్ సేవా ఇంటర్నేషనల్ సంస్థ 80 లక్షల డాలర్లను ఇండియాలో కోవిద్ సాయానికి గాను సమీకరించింది. ఈ సాయం నేడో,  రేపో భారత దేశానికి అందుతుందని ఈ  సంస్థ వర్గాలు తెలిపాయి. అట్లాంటా నుంచి 2,184 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను పంపనున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది.

చిన్న దేశమైన రుమేనియా కూడా ఈ సెకండ్ కోవిడ్ వేవ్ సమయంలో ఇండియాకు సాయం ప్రకటించడం  విశేషం. తమ దేశం నుంచి 80 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను . 75 ఆక్సిజన్ సిలిండర్లను భారత దేశానికి పంపనున్నట్టు ఈ దేశం ప్రకటించింది. కాగా ఇండియాలో కోవిడ్ పరిస్థితి ఇంకా ‘విషమం’గానే ఉంది. ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం కేంద్ర కేబినెట్ తో అత్యవసరంగా సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Telangana Municipal Elections 2021 LIVE: కొనసాగుతున్న మున్సి’పోల్స్’.. బారులు తీరిన ఓటర్లు

Chanakya Niti: మనిషి ఏ విషయాల్లో అసంతృప్తి చెందకూడదు..వేటి విషయంలో ఇక చాలు అని అనుకోకూడదు..ఆచార్య చాణక్య ఏం చెప్పారు?