Telangana Municipal Elections 2021: ముగిసిన మున్సి”పోల్స్”.. కార్పొరేషన్లలో తగ్గిన పోలింగ్.. మున్సిపాలిటీల్లో పెరిగిన ఓటింగ్ శాతం

| Edited By: Ravi Kiran

Updated on: Apr 30, 2021 | 5:55 PM

రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించింది ఎస్ఈసీ. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.

Telangana Municipal Elections 2021:  ముగిసిన మున్సిపోల్స్.. కార్పొరేషన్లలో తగ్గిన పోలింగ్.. మున్సిపాలిటీల్లో పెరిగిన ఓటింగ్ శాతం
Telangana Municipal Elections 2021 Live

Telangana Municipal Elections: రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్‌, కొత్తూరు మున్సిపాలిటీల ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటితోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్, మెట్‌పల్లి, అలంపూర్‌, జల్‌పల్లి, గజ్వేల్‌, నల్లగొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్‌లో ఒక్కో వార్డుకు ఉపఎన్నిక నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం.

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంగం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఈ ఎన్నికల కోసం మొత్తం 1,539 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,809 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించారు. ఇక, అవాంఛనీయ సంఘనటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద శానిటైజర్‌, మాస్కులు, గ్లౌసులు అందుబాటులు ఉంచారు. మే 3న ఫలితాలు వెలువడనున్నాయి.

గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో 66 డివిజన్లలో 500 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఇక్కడ 6,53,240 ఓట్లకు గానూ మొత్తం 878 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం కార్పొరేషన్‌లో 59 డివిజన్లు ఉండగా, 250 మంది బరిలో నిలిచారు. ఇక్కడ 2,88,929 మంది ఓటర్లకు గానూ 373 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా ఖమ్మం కార్పొరేషన్‌లో ఇప్పటికే 10 డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవమయ్యారు.

సిద్దిపేట మున్సిపాలిటీలో 43 వార్డులకు పోలింగ్‌ జరుగుతున్నది. ఇక్కడ 1,00,678 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 236 మంది పోటీచేస్తుండగా, 130 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. నకిరేకల్‌ మున్సిపాలిటీలో 20 వార్డులకుగాను 93 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొత్తం 40 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు.

అదేవిధంగా జడ్చర్ల మున్సిపాలిటీలో 27 వార్డుల్లో 112 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 41,515 మంది ఓటర్లకు గానూ 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక అచ్చంపేట మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 66 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 20,529 మంది ఓట్లకు గానూ 44 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్తూరు మున్సిపాలిటీలో 12 వార్డులకు ఎన్నికలు జరిగాయి.

పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి మాస్కులతో పాటు ఫేస్​ షీల్డ్​, శానిటైజర్లను ఏర్పాటు చేశారు.  కాగా, ఓట్ల లెక్కింపు తర్వాత గెలుపు సంబురాలు, ర్యాలీలను నిషేధిస్తున్నట్టు ఎస్ఈసీ పార్థసారథి వెల్లడించారు. గెలిచిన అభ్యర్థితో పాటు ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. ఎవరైనా ఈ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతుండటంతో అందరిలోనే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నామని ఎన్నికల అధికారులు తెలిపారు.

Read Also…  Lingojiguda Division: లింగోజిగూడ డివిజన్‌ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం… కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Apr 2021 05:06 PM (IST)

    రాష్ట్రంలో ముగిసిన మున్సిపల్ పోలింగ్

    రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్‌, కొత్తూరు మున్సిపాలిటీల ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటితోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్, మెట్‌పల్లి, అలంపూర్‌, జల్‌పల్లి, గజ్వేల్‌, నల్లగొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్‌లో ఒక్కో వార్డుకు ఉపఎన్నిక నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. కాగా, ప్రస్తుతం క్యూలైన్‌లో నిలిచి ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతినిస్తున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించి కౌటింగ్ మే 3వ తేదీన చేపట్టనున్నారు.

  • 30 Apr 2021 03:58 PM (IST)

    మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి…

    గ్రేటర్ వరంగల్‌లో 44.15 శాతం పోలింగ్

    ఖమ్మంలో 51.36 శాతం పోలింగ్‌

    కొత్తూరులో 76.79 శాతం పోలింగ్

    లింగోజిగూడలో 22.37 శాతం పోలింగ్‌

    సిద్దిపేటలో 58.25 శాతం పోలింగ్

    జడ్చర్లలో 54.21 శాతం పోలింగ్‌

    అచ్చంపేటలో 60.50 శాతం పోలింగ్‌

    నకిరేకల్‌లో 76.61 శాతం పోలింగ్‌

  • 30 Apr 2021 01:36 PM (IST)

    మధ్యాహ్నం ఒంటిగంట వరకు నమోదైన ఓటింగ్...

    రెండు కార్పొరేషన్లు, 5 మున్సి పాలిటీల్లో ఓటింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు నమోదైన పోలింగ్ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

    వరంగల్‌లో 37.98 శాతం పోలింగ్

    ఖమ్మంలో 45.56 శాతం పోలింగ్

    సిద్దిపేటలో 46.79 శాతం పోలింగ్

    కొత్తూరులో 65.05 శాతం పోలింగ్

    అచ్చంపేటలో 51 శాతం పోలింగ్

    జడ్చర్లలో 46.67 శాతం పోలింగ్

    నకిరేకల్‌లో 65.74 శాతం పోలింగ్

    లింగోజిగూడలో18.26 శాతం పోలింగ్

  • 30 Apr 2021 01:34 PM (IST)

    వెబ్ కెమెరా ద్వారా పోలింగ్ పరిశీలించిన ఎస్ఈసీ

    తెలంగాణలో జరుగుతున్న మినీ పుర పోరు తీరును రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పరిశీలించారు. రెండు కార్పొరేషన్లు, 5 మున్సి పాలిటీల్లో ఓటింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వివిధ మున్సిపాలిటీల్లో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ను వెబ్ కెమెరా ద్వారా ఎస్ఈసీ పరిశీలించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటర్లందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు.

  • 30 Apr 2021 01:29 PM (IST)

    పోలింగ్ బూత్‌లో విషాదం

    గ్రేటర్ మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో విషాదం చోటుచేసుకుంది. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 57వ డివిజన్ సమ్మయ్య నగర్ లో పోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు రమేష్‌బాబు గుండెపోటుతో మృతి చెందారు. జనగామ జిల్లాలోని చిల్పూర్ మండలంలోని కొండాపూర్ తండా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఆయన పని చేస్తున్నారు.

  • 30 Apr 2021 01:27 PM (IST)

    సిద్ధిపేటలో ఓటేసిన మంత్రి హరీష్ రావు

    రెండు కార్పొరేషన్లు, 5 మున్సి పాలిటీల్లో ఓటింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులోని 69వ పోలింగ్ బూత్‌లో మంత్రి హరీష్‌రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సమయానుకూలంగా ఓటర్లందరూ వచ్చి విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.

    Minister Harishrao

    Minister Harishrao

  • 30 Apr 2021 12:14 PM (IST)

    ఖమ్మంలో బీజేపీ ఆందోళన..

    ఖమ్మం కార్పొరేషన్‌ 20వ డివిజన్‌ పరిధిలో బీజేపీ ఆందోళన చేపట్టింది. కాలేజీ విద్యార్థులతో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు ప్లకార్టులతో ధర్నాకు దిగారు.

  • 30 Apr 2021 12:12 PM (IST)

    ఖమ్మంలో స్వల్ప ఉద్రిక్తం

    ఖమ్మం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పీజీ కాలేజీ సెంటర్‌ ముందు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.

    Khammam Trs, Congress Fight

    Khammam Trs, Congress Fight

  • 30 Apr 2021 11:35 AM (IST)

    ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

    వరంగల్ మట్టెవాడలోని ఓ పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య  తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 30 Apr 2021 11:25 AM (IST)

    ఉదయం 11 గంటల వరకు నమోదై పోలింగ్ ఇలా ఉన్నాయి..

    కొత్తూరు మున్సిపాలిటీలో 43.99 శాతం పోలింగ్

    అచ్చంపేటలో 34 శాతం పోలింగ్

    జడ్చర్లలో 23 శాతం పోలింగ్

    నకిరేకల్‌లో 45.55 శాతం పోలింగ్

    సిద్దిపేటలో 31.39 శాతం పోలింగ్

    లింగోజిగూడలో 12.52 శాతం

    గ్రేటర్ వరంగల్‌ మున్సిపల్ కార్పొరేషన్‌లో 23.62 శాతం

    ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో 23.41 శాతం పోలింగ్

  • 30 Apr 2021 11:23 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ రాములు

    అచ్చంపేట మున్సిపల్ పోలింగ్ సందర్భంగా నాగర్ కర్నూలు ఎంపీ రాములు కుటుంబ సమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    Nagarkurnool Mp Ramulu

    Nagarkurnool Mp Ramulu

  • 30 Apr 2021 11:22 AM (IST)

    ఓటేసిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

    నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు.. అచ్చంపేటలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 30 Apr 2021 10:54 AM (IST)

    ఓటేసిన సిద్ధిపేట సీపీ జోయల్ డేవిస్

    సిద్దిపేట మున్సిపల్ పోలింగ్ సందర్భంగా నగర పోలీసు కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ దంపతులు ఓటు వేశారు.. ఉర్ధూ మీడియం హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    Siddipet Cp Devis

    Siddipet Cp Devis

  • 30 Apr 2021 10:49 AM (IST)

    ఓటేసిన వరంగల్ కలెక్టర్ రాజీవ్ హనుమంతు

    వరంగల్ నగరంలోని ఆర్ట్స్ అండ్‌ సైన్స్ కాలేజీలో జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 30 Apr 2021 10:47 AM (IST)

    హన్మకొండలో ఓటేసిన కడియం శ్రీహరి

    గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా హన్మకొండలోని సెయింట్‌ థామస్‌ హైస్కూల్‌లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. 60వ డివిజన్‌లోని పోలింగ్ బూత్‌లో శ్రీహరి దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    Kadiyam Srihari Couple Cast Vote

    Kadiyam Srihari Couple Cast Vote

  • 30 Apr 2021 10:45 AM (IST)

    జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

    జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే బారులు తీరి ఓటు వేస్తున్నారు. జడ్చర్లలోని ఓ పోలింగ్ బూత్‌లో  ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 30 Apr 2021 10:03 AM (IST)

    ఉదయం 9 గంటలకు నమోదైన పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి..

    వరంగల్‌ కార్పొరేషన్‌లో 11.2 శాతం పోలింగ్ జడ్చర్ల మున్సిపాలిటీలో 12 శాతం పోలింగ్ అచ్చంపేటలో 11 శాతం నకిరేకల్‌లో 21.30 శాతం కొత్తూరులో 19.22 శాతం

  • 30 Apr 2021 09:27 AM (IST)

    ఓటు వేసిన మంత్రి పువ్వాడ అజయ్

    ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఖమ్మంలోని ఓ పోలింగ్ బూత్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌ కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 30 Apr 2021 08:10 AM (IST)

    మే 3న లెక్కింపు

    ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపును మే 3న చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు, ఆ తర్వాత ఫలితాల ప్రకటన ఏర్పాట్లపై కూడా అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం పలు సూచనలు చేసింది.

  • 30 Apr 2021 07:29 AM (IST)

    ఓటేసేందుకు ప్రత్యేక గ్లౌజులు

    కోవిడ్-19 ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఓటర్లు భౌతిక దూరాన్ని పాటించాలని, తప్పని సరిగా సానిటైజ్ చేసుకోవాలని, దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటర్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని దీనిని తప్పనిసరి చేసినట్లు వారు చెప్పారు. అంతే కాకుండా ఓటేసేందుకు కూడా గ్లౌజులను ఏర్పాటు చేసినట్లు, ఓటు వేసే సమయంలో ఓటర్లు ఇవి తప్పనిసరిగా ఉపయోగించాలని అన్నారు.

  • 30 Apr 2021 07:27 AM (IST)

    ఎన్నికల విధుల్లో 9,809 మంది సిబ్బంది

    మున్సిపల్ ఎన్నికల కోసం మొత్తం 1,539 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 9,809 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. అవాంఛనీయ సంఘనటనలు జరుగకుండా భారీ బందోబస్సు ఏర్పాటుచేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద శానిటైజర్‌, మాస్కులు, గ్లౌసులు అందుబాటులు ఉంచారు. మే 3న ఫలితాలు వెలువడనున్నాయి.

  • 30 Apr 2021 07:16 AM (IST)

    ఓటు హక్కు వినియోగించుకోనున్న 11.34 లక్షల మంది

    మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో మొత్తం 11,34,032 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇదులో 5,57,759 మంది పురుషులు కాగా, 5,76,037 మంది మహిళలు ఉన్నారు. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరుతున్నారు. భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది.

  • 30 Apr 2021 07:14 AM (IST)

    ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

    రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఇందులో గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్‌, కొత్తూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటితోపాటు మెట్‌పల్లి, అలంపూర్‌, జల్‌పల్లి, గజ్వేల్‌, నల్లగొండ, బెల్లంపల్లి, పరకాల, బోధన్‌లో ఒక్కో వార్డుకు, జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌కు ఉపఎన్నిక జరుగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

Published On - Apr 30,2021 5:06 PM

Follow us