Bengal Elections: ఆద్యంతం ఆసక్తికరం బెంగాల్ పోరు.. ఎగ్జిట్ పోల్సే నిజమైతే దీదీదే మళ్ళీ రాజ్యం

బెంగాల్ ఎన్నికలు ఆధ్యంతం రక్తి కట్టాయి. ఎనిమిది విడతల్లో సుదీర్ఘంగా సాగిన ఎన్నికల పర్వానికి మే రెండో తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో...

Bengal Elections: ఆద్యంతం ఆసక్తికరం బెంగాల్ పోరు.. ఎగ్జిట్ పోల్సే నిజమైతే దీదీదే మళ్ళీ రాజ్యం
West Bengal
Follow us
Rajesh Sharma

|

Updated on: Apr 30, 2021 | 5:55 PM

Bengal Elections interesting exit-poll results: బెంగాల్ ఎన్నికలు (BENGAL ELECTIONS) ఆధ్యంతం రక్తి కట్టాయి. ఎనిమిది విడతల్లో సుదీర్ఘంగా సాగిన ఎన్నికల పర్వానికి మే రెండో తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెరపడనున్నది. అయితే ఏప్రిల్ 29వ తేదీన జరిగిన తుది విడత పోలింగ్ తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో 90 శాతం మమతాబెనర్జీ (MAMATA BAJERNEE)దే విజయమని చాటాయి. అయితే బీజేపీ (BJP) కూడా బాగా పుంజుకున్నట్లు గణాంకాలలో తేలింది. డ్రామాలు, సవాళ్ళు, రాజకీయ ఎత్తుగడలతో సాగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల (BENGAL ASSEMBLY ELECTIONS) పర్వాన్ని అటు బీజేపీ, ఇటు తృణమూల్ కాంగ్రెస్ (TRINAMOOL CONGRESS) సవాలుగా తీసుకున్నాయి. బీజేపీ జాతీయ అధినాయకత్వం (BJP HIGH COMMAND) తరపున జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా (BJP NATIONAL PRESIDENT JP NADDA), ప్రధాని నరేంద్ర మోదీ (PRIME MINISTER AMIT SHAH), హోం మంత్రి అమిత్ షా (HOME MINISTRY AMIT SHAH), బెంగాల్‌కు చెందిన వెటరన్ బాలీవుడ్ నటుడు (BOLLYWOOD ACTER) మిథున్ చక్రవర్తి (MITHUN CHAKRABORTY) తదితరులు స్టార్ అట్రాక్షన్లుగా మారి ప్రచారం నిర్వహించారు. ఎన్నికలకు ముందు దీదీకి ఝలక్ ఇచ్చి మరీ బీజేపీలో చేరిన సువేందు అధికారి తనకు తానుగా ముఖ్యమంత్రి (CHIEF MINISTER) అభ్యర్థిగా భావించి నందిగ్రామ్‌ (NANDIGRAM)లో సిట్టింగ్ సీఎం (SITTING CHIEF MINISTER) మమతాబెనర్జీని ఢీకొన్నారు. చివరి విడత ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బెంగాల్‌లో ఎగిరేది బీజేపీ పతాకమేని చాటుకున్నారు. కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు (EXIT POLL RESULTS) మాత్రం మమతాబెనర్జీకి అనుకూలంగానే వచ్చాయి. ఒక్క రిపబ్లిక్ టీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ మాత్రం స్వల్ప మెజారీటీతో బీజేపీ జయకేతనం ఎగురవేయనున్నదని చాటింది.

ఎనిమిది విడతల్లో సుదీర్ఘంగా సాగిన బెంగాల్ ఎన్నికల పర్వంలో తొలి పోలింగ్ మార్చి 27వ తేదీన జరగగా.. తుదిగా ఎనిమిదో విడత ఏప్రిల్ 29న జరిగింది. పోలింగ్ శాతం కూడా భారీగానే నమోదైంది. ఎనిమిది విడతల్లో కలిపి మొత్తం సరాసరిగా 78.2 శాతం పోలింగ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైంది.

పోలింగ్ శాతం – విడతల వారీగా:

1వ విడత పోలింగ్‌, 30 స్థానాలు (27-03-2021) – 82.00% 2వ విడత పోలింగ్‌, 30 స్థానాలు (01-04-2021) – 80.53% 3వ విడత పోలింగ్‌, 31 స్థానాలు (06-04-2021) – 78.00% 4వ విడత పోలింగ్‌, 44 స్థానాలు (10-04-2021) – 76.16% 5వ విడత పోలింగ్‌, 45 స్థానాలు (17-04-2021) – 78.36% 6వ విడత పోలింగ్‌, 43 స్థానాలు (22-04-2021) – 79.09% 7వ విడత పోలింగ్‌, 36 స్థానాలు (26-04-2021) – 75.06% 8వ విడత పోలింగ్‌, 35 స్థానాలు (29-04-2021) – 76.07%

2011 అసెంబ్లీ ఎన్నికల పోరాటంలో మమతా బెనర్జీ ప్రచార సరళి వామపక్ష ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ సాగింది. మార్క్సిస్టులందరూ ధనికులుగా మారిపోయారు, పేదలను దోచుకుంటున్నారనే ప్రచారంలో మమత విజయం సాధించారు. అప్పటివరకు జరిగిన ఎన్నికలలో రిజర్వుడు స్థానాలలో ఆయా కులాల అభ్యర్ధులు, జనరల్‌ స్థానాలలో అగ్రకులాల అభ్యర్దులే పోటీ చేసేవారు. మార్క్సిస్టు, టీఎంసీ పార్టీలు కూడా ఇదే విధానాన్ని అవలంబించాయి. 2016 తరువాత హిందుత్వతో పాటు నిమ్న కులాల వారిని కూడగట్టడం ప్రారంభించిన బీజేపీ.. సరస్వతీ శిశు విద్యా మందిర్‌, సేవా భారతి, భారతీయ మజ్దూర్‌ సంఘ్‌, దుర్గా వాహిని తదితర సంస్థల ద్వారా కార్యక్రమాలను ముమ్మరం చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో అనేక జనరల్‌ స్థానాలలో కూడా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు టిక్కెట్లు కేటాయించింది బీజేపీ. అంతేకాక ముస్లింలు అధికంగా ఉన్న చోట హిందూ కులాలన్నింటిని కూడగట్టే వ్యూహాలు రచించింది బీజేపీ. ఫలితంగా 2016 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన 10.16 శాతం ఓట్లను 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి 40.3 శాతానికి పెంచుకున్నది బీజేపీ. 2019 ఎన్నికల్లో ఏకంగా 18 లోక్‌సభ స్థానాలను బెంగాల్‌లో కైవసం చేసుకున్నది. ఈ 18 లోక్‌సభ స్థానాల పరిధిలోని 116 అసెంబ్లీ స్థానాలలో ఈ సారి కూడా బీజేపీకే ఆధిక్యం లభించబోతున్నట్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అసాధారణ విజయాలతో విస్తుపోయిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. నిమ్న కులాల వారికి చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేసింది. దళితులు, ఓబీసీలు, గిరిజనులకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించింది. మంత్రిత్వ శాఖల్లో కూడా వారికి ప్రాధాన్యత కల్పించింది.

ఇక ఎన్నికల్లోను పార్టీకి అన్నీ తానై ప్రచారం నిర్వహించారు సిట్టింగ్ సీఎం మమతా బెనర్జీ. తొలిసారి సంచలన నందిగ్రామ్‌ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ పోటీకి దిగారు. దానికి కారణం అప్పటి వరకు తన వెన్నంటే వుండి ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన సువేందు అధికారిపై పగ తీర్చుకునేందుకు ఆమె తాను గతంలో పోటీ చేసిన భవానీపూర్ నుంచి కాకుండా నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగారు. నామినేషన్ పర్వం నుంచే మమతా బెనర్జీ నాటకాలు ప్రారంభించారు. నామినేషన్ దాఖలు సమయంలో జరిగిన స్వల్ప గాయాన్ని సుదీర్గంగా నెలన్నర రోజుల పాటు చాటేందుకు, తద్వారా సానుభూతి పొందేందుకు ఆమె యత్నించారు. నామినేషన్‌ దాఖలు సందర్భంగా మార్చి 10న తనపై దాడి జరిగిందని, కాలికి గాయం అయ్యిందని, ఇది బీజేపీ గూండాల పనే అని ఆరోపించిన మమతా బెనర్జీ.. మొత్తం 8 దశల బెంగాల్‌ ఎన్నికల ప్రచారాన్ని వీల్‌ ఛైర్‌‌లోనే కొనసాగించారు. ఇదంతా సానుభూతి కోసం దీదీ చేస్తోన్న జిమ్మిక్కుగా బీజేపీ నేతలు కొట్టి పారేశారు.

ఇక బీజేపీ సైతం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2019లో 18 లోక్‌సభ స్థానాల పరిధిలోను 116 అసెంబ్లీ సీట్లను కాపాడుకుంటూనే ఇంకాస్త పెంచుకోగలిగితే బెంగాల్ అసెంబ్లీలో పాగా వేయొచ్చని బీజేపీ భావించింది. బెంగాల్ ఎన్నికల్లో ప్రభావం చూపగలరు అనుకున్న వారందరినీ పార్టలోకి చేర్చుకున్నారు కమలనాథులు. బాలీవుడ్ వెటరన్ యాక్టర్ మిథున్ చక్రవర్తి, నందిగ్రామ్ ఎంపీ సువేందు అధికారి తదితరులు ఎన్నికలకు ముందు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధాని మోదీ, అమిత్‌ షా సహా కేంద్ర, రాష్ట్ర నాయకులందరి ప్రచార సభలు నిర్వహించారు. ఎన్నికలల్లో తమ పార్టీ గెలిస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకాలు అందిస్తామని ప్రకటించారు. తృణమూల్‌ మాఫియా రాజ్‌‌ను తుడిచి పెట్టాలని ప్రచార సభల్లో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని హామీ ఇచ్చారు.

మొత్తం 8 విడతల ఎన్నికలకుగాను 6 విడతల ప్రచారంలో ప్రధాని స్వయంగా పాల్గొనడం బీజేపీ బెంగాల్ ఎన్నికలకు ఏ మేరకు ప్రాధాన్యతనిచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కరోనా నివారణ చర్యలు, కార్యక్రమాల కారణంగా చివరి రెండు విడతల ప్రచారానికి మోదీ దూరంగా వున్నారు. పేదల అభివృద్ది కోసం ప్రధాని మోదీ స్కీంలు పెడుతుంటే… బెంగాల్‌ ప్రజలను దోచుకోవడానికి మమతా బెనర్జీ స్కాంలు చేస్తున్నారని అమిత్‌ షా ఆరోపించారు. తన మేనల్లుడిని సీఎం చేయడమే మమత లక్ష్యమని అమిత్ షా ఎద్దేవా చేశారు. తమ ప్రచారంలో బెంగాల్ కోసం ‘ప్రగతిశీల బంగ్లా’, ‘షోనార్ బాంగ్లా’ లాంటి మాటలను బీజేపీ అగ్ర నేతలు విరివిగా వినియోగించారు. అటు తృణమూల్, ఇటు బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బెంగాల్ ఎన్నికల్లో నిజమైన విజయం ఎవరిదో మే 2న సాయంత్రం తేలనున్నది.

ALSO READ: భారత్ విషయంలో అమెరికా యూ-టర్న్.. కారణాలు తెలిస్తే షాకే!

ALSO READ: పది రాష్ట్రాల్లోనే 90 శాతం కరోనా కేసులు.. మహారాష్ట్ర అధికం కట్టడికి దారేది?

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!