AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో డీఎంకేకి అధికార పగ్గాలు ? బెంగాల్ లో దీదీ, కేరళలో లెఫ్ట్, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

ఈ నెల 7 న 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాల తాలూకు ఎగ్జిట్ పోల్స్ దేశ సరికొత్త రాజకీయ వ్యవస్థకు దారి తీసేవిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ హవాకు బ్రేక్ పడినట్టేనని భావిస్తున్నారు.

తమిళనాడులో డీఎంకేకి అధికార పగ్గాలు ? బెంగాల్ లో దీదీ, కేరళలో లెఫ్ట్, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
Dmk May Sweep In Tamilnadu Says Exit Polls
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Apr 29, 2021 | 10:38 PM

Share

ఈ నెల 7 న 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాల తాలూకు ఎగ్జిట్ పోల్స్ దేశ సరికొత్త రాజకీయ వ్యవస్థకు దారి తీసేవిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ హవాకు బ్రేక్ పడినట్టేనని భావిస్తున్నారు. తమిళనాడులో డీఎంకే, బెంగాల్ లో సీఎం, మమతా బెనర్జీ నేతృత్వంలోని  తృణమూల్  కాంగ్రెస్, కేరళలో లెఫ్ట్, పుదుచ్చేరిలో ఎన్ ఆర్ సి దాని మిత్ర పక్షాలదే పై చేయి అవుతుందని, ఒక్క అస్సాంలో మాత్రం బీజేపీ కూటమి  గెలిచే అవకాశాలు ఉన్నాయని ఈ పోల్స్ వెల్లడిస్తున్నాయి. తమిళనాడులో అధికార అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని  దక్షిణాదిన కాస్త పైకి వద్దామనుకున్న బీజేపీ ఇక ఆత్మపరిశిలన చేసుకోక తప్పదని భావిస్తున్నారు. ఈ రాష్ట్రంలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అధికార పగ్గాలను చేబడుతుందని ఈ ఫలితాలు చెబుతున్నాయి. ఈ పార్టీ 165 సీట్లను గెలుచుకోగలదని, అన్నా డీఎంకే 66 సీట్లతో రెండో స్థానంలో వస్తుందని లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో 234 సీట్లు ఉన్నాయి. నటుడు, రాజకీయనేత  కూడా అయిన కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం భవిష్యత్తు ఏమవుతుందో తెలియదని అయితే టీటీవీ దినకరన్ పార్టీ ఎం ఎం కె పార్టీ ఒక స్థానంతో సంతృప్తి పడుతుందని తెలుస్తోంది. ఇక బెంగాల్ లో మమత ఆధ్వర్యంలోని టీఎంసీ కి తిరుగులేదని ఈ పోల్స్ స్పష్టం చేశాయి. ఈ పార్టీ 148 సీట్లను, బీజేపీ 131 సీట్లను గెలుచుకుంటాయన్నది ఈ ముందస్తు ఫలితాలసారాంశం .  బెంగాల్ లో మమత మళ్ళీ అధికారం చేపట్టజాలరని, తమదే అధికారమని ప్రధాని మోదీ, హోమ్ మంత్రి  అమిత్ షా కూడా ప్రచారం సందర్భంగా  ధీమా వ్యక్తం చేశారు.

అటు కేరళలో లెఫ్ట్ కూటమికి 85, యూడీఎఫ్ కి 53 స్థానాలు వస్తాయని అంచనా. అస్సాంలో బీజేపీ కూటమి, పుదుచ్చేరిలో ఎన్ ఆర్ సి దాని మిత్ర పక్షాలదే విజయమని ఈ లెక్కలు పేర్కొంటున్నాయి. మే 2 న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: కోట్లకు కోట్లు ఉన్నా అంతిమ కోరిక మాత్రం తీరలేదు

Telangana CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోమారు కరోనా పరీక్షలు.. ఎందుకంటే..!