ఢిల్లీకి బాసు కేజ్రీవాల్‌ కాదు, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కే అధికారాలు

అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఉన్న అరకొర అధికారాలు కూడా ఇక నుంచి ఉండవు. ఎందుకంటే దేశ రాజధానికి లెఫ్టినెంట్‌ గవర్నరే ఇక ఇన్‌ఛార్జ్‌గా ఉండబోతున్నారు కాబట్టి!

ఢిల్లీకి బాసు కేజ్రీవాల్‌ కాదు, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కే  అధికారాలు
Government Of Delhi Is Equal To Lieutenant Governor
Follow us
Balu

| Edited By: Phani CH

Updated on: Apr 29, 2021 | 10:10 PM

అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఉన్న అరకొర అధికారాలు కూడా ఇక నుంచి ఉండవు. ఎందుకంటే దేశ రాజధానికి లెఫ్టినెంట్‌ గవర్నరే ఇక ఇన్‌ఛార్జ్‌గా ఉండబోతున్నారు కాబట్టి! ఈ మేరకు నూతన చట్టాన్ని కేంద్రం బుధవారం నోటిఫై చేసింది. ఇక మీదట చిన్నా చితక పనులకు కూడా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం లెఫ్ట్‌లెంట్‌ గవర్నర్‌ అనుమతి తీసుకోవలసి ఉంటుంది. జీఎన్‌సీటీడీ-2021 అని పిలుచుకునే ఈ కొత్త చట్టాన్ని ఇటీవల పార్లమెంట్‌ ఆమోదించింది. అప్పుడే ఆమ్‌ ఆద్మీపార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా ఇది రాజ్యాంగవిరుద్ధమని గొంతెత్తాయి. అయితే పార్లమెంట్‌లో ఉన్న బీజేపీకి సంపూర్ణ బలం ఉండటంతో బిల్లు పాసయ్యింది. ఇక ఈ చట్టంలోని నిబంధనలు ఈ నెల 27 అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చెప్పేసింది కూడా! ఇప్పటి వరకు ఢిల్లీలో పబ్లిక్‌ ఆర్డర్, పోలీస్, భూ సంబంధిత అంశాలు కేంద్రం ఆధీనంలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, అడవులు, రవాణా ఇతర అంశాలు ఉన్నాయి. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ను కేంద్రం నియమిస్తున్నందున ఇక మీదట అన్ని అంశాలపై కేంద్రం పెత్తనమే సాగుతుంది. ఢిల్లీ ప్రభుత్వం అంటే కేజ్రీవాల్‌ది కాదన్నమాట! లెఫ్ట్‌నెంట్‌ గవర్నరే అన్నమాట! జీఎన్‌సీటీడీ బిల్లును కేంద్రం నోటిఫై చేయడంతో ఇక నుంచి ఢిల్లీలోని ఆప్‌ ప్రభుత్వం నామమాత్రంగానే ఉంటుందనేది రాజకీయ నిపుణుల మాట! లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ దాదాపు 80కి పైగా ప్రభుత్వశాఖలను తన ఆజమాయిషీలో పెట్టుకుంటారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కూడా నిలిపివేసే అధికారాలు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోని అంశాలైన విద్య, అవినీతి నిరోధం, ఆరోగ్యం, సాంఘీక సంక్షేమం, టూరిజం, ఎక్సైజ్, రవాణా లాంటి అంశాలతో పాటు అధికారుల బదిలీలతో సహా అన్ని విషయాల్లో అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనుమతి తీసుకోక తప్పదు. అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ రాష్ట్ర అధికారులకు నేరుగా ఆదేశాలివ్వవచ్చు. అంటే కేజ్రీవాల్‌ ఇక నుంచి ఉత్సవ విగ్రహంలా మారిపోతారన్నమాట! ఇతర రాష్ట్రాల్లోని గవర్నర్లతో పోలిస్తే ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అధికారాలు భిన్నమైనవని కేంద్రం అంటోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!

Exit Poll 2021: అస్సాంలో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య నువ్వా..నేనా! టీవీ9 ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడి

చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే