Exit Poll 2021: అస్సాంలో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య నువ్వా..నేనా! టీవీ9 ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడి

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఫలితాల పై పడింది. టీవీ9 ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం.. అస్సాం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎవరు అధికారం దక్కించుకోవచ్చు

Exit Poll 2021: అస్సాంలో అధికారం కోసం బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య నువ్వా..నేనా! టీవీ9 ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడి
Tv9 Exit Polls Assam
Follow us
KVD Varma

|

Updated on: Apr 29, 2021 | 8:56 PM

Exit Poll 2021:  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను అంతా సెమీఫైనల్ ఎన్నికలుగా అభివర్ణిస్తున్నారు. మార్చి రెండో తేదీన మొదలైన ఈ ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 28 వరకూ అంటే దాదాపు రెండునెలల సుదీర్ఘ కాలం కొనసాగింది. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ లో చివరి దశ వెస్ట్ బెంగాల్ లో ఏప్రిల్ 28న ముగిసింది. ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఫలితాల పై పడింది. ఎన్నికల వివిధ దశల్లో టీవీ 9 భారత్ వర్ష జరిపిన ఎగ్జిట్ పోల్ ఫలితాల సరళి ప్రస్తుతం అందుబాటులో ఉంది. టీవీ9 ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం.. అస్సాం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎవరు అధికారం దక్కించుకోవచ్చు.. గత ఎన్నికలకూ ఈ ఎన్నికలకూ మధ్య పార్టీల ఓటింగ్ ఎలా మారింది? ఒకసారి విశ్లేషిస్తీ..

అస్సాంలో మొత్తం మూడు విడతల్లో 27 మార్చి, 1 ఏప్రిల్, 6 ఏప్రిల్ తేదీల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం ఇక్కడ ఉన్న 126 అసెంబ్లీ స్థానాలకూ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, అస్సాం జాతీయ పరిషద్ సారధ్యంలో యూఆర్ఎఫ్ మూడు కూటములు పోరులో ఉన్నాయి. అలాగే సింగిల్ పార్టీగా నేషనల్ పీపుల్స్ పార్టీ ఐదు స్థానాల్లో పోటీ చేసింది. అయితే, ప్రధాన పోరు మాత్రం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

2019 ఎన్నికల్లో ఏ పార్టీ ఎలా?

భారతీయ జనతాపార్టీ ఈ ఎన్నికల్లో అస్సాం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్, రాభా జాతీయ ఐక్య మోర్చా, తివా జాతీయ ఐక్య మొర్చా పార్టీలతో కలసి ఎన్డీయే కూటమిగా పోటీ చేసింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ తొ కలసి జత కట్టి యూపీఏ కూటమిగా పోటీలో నిలిచింది. ఇక ఆల్ ఇండియా యునైటెడ్ ఫ్రంట్, జనతాదళ్ యూ కలసి ఒక కూతమిగానూ, లెఫ్ట్ పార్టీలన్నీ ఒక కూటమిగానూ పోటీ చేశాయి. ప్రధానంగా పోటీ మూడు పక్షాల మధ్య జరిగింది.

ఎన్డీఏ, యూపీఏ, జీఏల మధ్య జరిగిన ఈ ముక్కోణపు పోటీలో ఎన్డీఏ 41.5 శతం ఓట్లు సాధించింది. ఈ కూటమిలో బీజేపీ 29.5 శాతం ఓట్లతో తను పోటీ చేసిన 84 స్థానాలకు గానూ 60 స్థానాల్లో గెలిచింది. ఇక అదే కూటమి నుంచి 24 స్థానాల్లో పోటీ చేసిన అస్సాం గణపరిషత్ 14 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఎన్డీయే లోని మూడో పార్టీ బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 16 స్థానాల్లో పోటీ చేసి 12 స్థానాలు గెలుచుకుంది. మొత్తం 96 స్థానాలు గెలుచుకున్న ఎన్డీయే అధికారంలోకి వచ్చింది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ 122 స్థానాల్లో పోటీ చేసి 30.9 శాతం ఓట్లు సాధించినా 26 స్థానాల్లో మాత్రమె గెలవగలిగింది. అదే విధంగా మూడో కూటమిలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ 13 శాతం ఓట్లతో తాను పోటీ చేసిన 74 స్థానాలకు గానూ 13 స్థానాల్లో మాత్రమే గెలుపు సాధించింది.

ప్రస్తుత పరిస్థితి..

గత ఎన్నికల అనుభవాలతొ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడింది. ఈ సారి ప్రతిపక్షాలు అన్నీ ఒక్కతాటిపైకి వచ్చి బీజేపీ సారధ్యంలోని ఎన్డీయేను ఎదుర్కున్నాయి. ఇక్కడ ఎన్డీయే లో బీజేపీ, అస్సాం గణపరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) మూడు పార్టీలు కూటమిగా నిలిచాయి. అటు కాంగ్రెస్ తో యూపీఏ భాగస్వాములుగా ఏఐయూడీఎఫ్, బీపీఎఫ్, అన్ని కమ్యూనిస్టు పార్టీలు, అంచలిక్ గణ మోర్చా, రాష్ట్రీయ జనతా దళ్ కలిసి పోటీ చేశాయి. అస్సాం జాతీయ పరిషద్ రాయిజర్ దళ్ పార్టీతో కలిసి మూడో కూటమిగా బరిలో నిలిచింది. సింగిల్ పార్టీగా నేషనల్ పీపుల్స్ పార్టీ ఐదు స్థానాల్లో పోటీ చేసింది. కానీ, ఎన్నికలు పూర్తిగా ఎన్డీయే, యూపీఏ కూటముల మధ్య హోరాహోరీగా జరిగాయి.

టీవీ9 ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి.

అస్సాం ఎన్నికల్లో మూడువిడతల్లోనూ టీవీ9 భారత్ వర్ష ఎగ్జిట్ పోల్స్ నిర్వహించింది. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఇక్కడ పోటీ చేసిన రెండు కూటముల మధ్యా హోరా హోరీగా సాగినట్టు కనిపిస్తోంది. టీవీ9 ఎగిట్ పోల్ ఫలితాలను చూస్తే.. ఎన్డీయే 41.70 శాతం ఓట్లతో 59 నుంచి 69 సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా యూపియే కూటమి 45.40 శాతం ఓట్లతొ 55 నుంచి 65 సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇతర పార్టీలు 12.09 శాతం ఓట్లను సాధించి 1 నుంచి 3 సీట్లను సాధించవచ్చు.

గత ఎన్నికలతో పోలిస్తే.. ఇక్కడ ఎన్డీయే కూటమి తన ఓటు శాతాన్ని పెద్దగా కోల్పోతున్నట్టు కనిపించడం లేదు. కానీ, యూపీఏ ఓటు శాతం మాత్రం దాదాపు 15 శతం పైగా పెరిగింది. గత ఎన్నికల్లో యూపీఏ లో భాగస్వామ్య పక్షాలు లేవు. యూపీపీఎల్ ఒక్కటే భాగస్వామిగా ఉంది. కానీ, ఈసారి దానికి విరుద్ధంగా చాలా పార్టీలు (లెఫ్ట్ పార్టీలతో సహా) యూపీఏ తో జత కట్టాయి. దీంతో ఓట్ల బదలాయింపు జరిగినట్టు కనిపిస్తోంది. అందుకే యూపీఏ గెలవబోయే సీట్ల సంఖ్య పెరిగినట్టు స్పష్టం అవుతోంది.

ఇక బీజేపీ తన ఓటు శాతాన్ని నిలబెట్టుకున్నప్పటికీ.. ముస్లిం ఓటు శాతం అధికంగా యూపీఏ వైపు నిలిచింది. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. కులాల వారీగా ఓట్ల శాతాన్ని చూసుకుంటే.. ఇక్కడ ఎస్సీ, ఎస్టీల ఓట్లలో 53.90 శాతం ఓటర్లు ఎన్దీయే పట్ల మొగ్గు చూపగా యూపీఏ వైపు 31.90 శాతం నిలిచారు. అదే ముస్లిం ఓటర్లలో యూపీఏకి ఏకంగా 79.90 శాతం ఓటర్లు జై కొడితే.. 13.3 శాతం మాత్రమే ఎన్డీయే కు ఓటు వేసినట్టు తేలింది. ఇక హిందువులు ఇతరుల్లో 57.90 శాతం ఎన్డీయే పక్షాన నిలబడితే, 24.40 శాతం ఓటర్లు యూపీఏ వైపు చూశారు. ఇక ఇతర పార్టీలు అన్నీ కలసి 12.90 శాతం ఓట్లను సాధించారు.

మొత్తంగా చూసుకుంటే.. అస్సాంలో ఏ కూటమికీ స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. ఎన్డీయే గత ఎన్నికల కన్నా దాదాపు 27 నుంచి 12 సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. ఈ నేపధ్యంలో యూపీఏ తన సీట్ల సంఖ్యా పెంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో అస్సాం ఎన్నికల్లో పీఠం ఎవరిదీ అనేది చెప్పడం ప్రస్తుతం కష్టతరంగానే కనిపిస్తోంది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే