Assam Exit Polls: అస్సాంలో అధికారం ఎవరిది? టీవీ 9 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏం చెబుతున్నాయి?
Assam Elections exit Poll Results 2021: సుదీర్ఘ ఎన్నికల సంగ్రామం ముగిసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేశారు.
Assam Elections exit Poll Results 2021: సుదీర్ఘ ఎన్నికల సంగ్రామం ముగిసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేశారు. ఎన్నికల్లో చివరి ఘట్టం అయిన వెస్ట్ బెంగాల్ లో ఎనిమిదో విడత పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఇప్పుడు ఏ ఐదు రాష్ట్రాల్లో ఓటర్లు ఏ పార్టీ వైపు నిలిచారు? ఏ పార్టీని తమ భవిష్యత్ నిర్దేశాకులుగా నెత్తిన పెట్టుకోబోతున్నారు వంటి వివరాలు మే రెండో తేదీన జరగబోయే ఓట్ల లెక్కింపులో తేలిపోనుంది. అయితే, ఈ ఎన్నికల పోలింగ్ సరళిని టీవీ9 భరత్ వర్ష ఎగ్జిట్ పోల్స్ అంచనాల ద్వారా ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా వేసింది. అస్సాం లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ప్రజల నాడి పట్టుకునే ప్రయత్నంలో నిర్వహించిన టీవీ9 భరత్ వర్ష ఎగ్జిట్ పోల్స్ లో వివిధ వర్గాల ప్రజలు ఏ పార్టీవైపు మొగ్గు చూపారు.. అధికారం సాధించే దిశలో ఏ పార్టీ ప్రజల మనసులు గెలుచుకోగలిగింది వివరాలతో పాటు ఇక్కడి అధికార పార్టీ బీజీపీ తన పట్టు నిలుపుకునే అవకాశాలు ఏమేర ఉన్నాయో తెలుసుకుందాం.
అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలు..
అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు ఏప్రిల్ 6న ముగిశాయి. మొత్తం మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొదటి దశ ఓటింగ్ మార్చి 27న, రెండో దశ ఏప్రిల్ 1న, మూడో దశ ఏప్రిల్ 6న జరిగింది. ఇక్కడ అధికార పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, అస్సాం జాతీయ పరిషద్ సారధ్యంలో యూఆర్ఎఫ్ మూడు కూటములు పోరులో ఉన్నాయి. అయితే, ప్రధాన పోరు మాత్రం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
టీవీ 9 ఎగ్జిట్ పోల్స్..
అస్సాం లో మొత్తం 2,33,74,087 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 82.04 శాతం మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. టీవీ 9 భారత్ వర్షా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీయే 41.70 శాతం ఓట్లతో 59 నుంచి 69 సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా యూపియే కూటమి 45.40 శాతం ఓట్లతొ 55 నుంచి 65 సీట్లు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇతర పార్టీలు 12.09 శాతం ఓట్లను సాధించి 1 నుంచి 3 సీట్లను సాధించవచ్చు.
కులాల వారీగా ఓట్ల శాతాన్ని చూసుకుంటే.. ఇక్కడ ఎస్సీ, ఎస్టీల ఓట్లలో 53.90 శాతం ఓటర్లు ఎన్దీయే పట్ల మొగ్గు చూపగా యూపీఏ వైపు 31.90 శాతం నిలిచారు. అదే ముస్లిం ఓటర్లలో యూపీఏకి ఏకంగా 79.90 శాతం ఓటర్లు జై కొడితే.. 13.3 శాతం మాత్రమే ఎన్డీయే కు ఓటు వేసినట్టు తేలింది. ఇక హిందువులు ఇతరుల్లో 57.90 శాతం ఎన్డీయే పక్షాన నిలబడితే, 24.40 శాతం ఓటర్లు యూపీఏ వైపు చూశారు. ఇక ఇతర పార్టీలు అన్నీ కలసి 12.90 శాతం ఓట్లను సాధించారు.