Metro Man Sreedharan: మెట్రోమాన్‌ శ్రీధరన్‌కు ఆశాభంగం తప్పదా?.. కేరళ ఫలితాల్లో ఏం తేలనుంది..?

కేరళ అసెంబ్లీకి సంబంధించినంత వరకు ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు ఎలాంటి గందరగోళానికి తావివ్వలేదు. దాదాపుగా అన్ని సంస్థలు ఎల్‌డీఎఫ్‌ అధికారాన్ని నిలబెట్టుకుంటుందనే చెప్పాయి.

Metro Man Sreedharan: మెట్రోమాన్‌ శ్రీధరన్‌కు ఆశాభంగం తప్పదా?.. కేరళ ఫలితాల్లో ఏం తేలనుంది..?
Udf Candidate Shafi Pips Bjp Candidate Sreedharan In Palakkad
Follow us

|

Updated on: Apr 30, 2021 | 4:02 PM

కేరళ అసెంబ్లీకి సంబంధించినంత వరకు ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు ఎలాంటి గందరగోళానికి తావివ్వలేదు. దాదాపుగా అన్ని సంస్థలు ఎల్‌డీఎఫ్‌ అధికారాన్ని నిలబెట్టుకుంటుందనే చెప్పాయి. సీట్ల విషయంలో అటూ ఇటూ కావొచ్చేమో కానీ ఎల్‌డీఎఫ్‌ గెలవడం మాత్రం ఖాయమనేశాయి. అద్సరేకానీ, మెట్రోమాన్‌ ఈ.శ్రీధరన్‌ పోటీ చేస్తున్న పాలక్కాడ్‌ నియోజకవర్గం సంగతేమిటి? అక్కడ బీజేపీ జెండా ఎగురుతుందా? శ్రీధరన్‌ గెలుస్తారా? అంటే అది మాత్రం జరగని పని అని తేల్చేశాయి.

ఎగ్జిట్‌పోల్స్‌. పాలక్కాడ్‌లో యునైటెడ్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ (యుడీఎఫ్‌) అభ్యర్థి షఫీ పరంబిల్‌ హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకోబోతున్నారట! కాంగ్రెస్‌ పార్టీకి చెందిన షఫీ 38.4 శాతం ఓట్లు సంపాదించుకోబోతున్నారు. మరోవైపు శ్రీధరన్‌కు 33.6 శాతం ఓట్లు మాత్రమే పడబోతున్నాయట! ఎల్‌డీఎఫ్‌ అభ్యర్థి సి.పి.ప్రమోద్‌ 21 శాతం ఓట్లతో మూడో స్థానంతో సంతృప్తి పడాల్సి ఉంటుందట! బీజేపీ నుంచి శ్రీధరన్‌ పోటీ చేస్తున్నారనగానే పాలక్కాడ్‌ నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది. యూడీఎఫ్‌, ఎన్‌డీఎ, ఎల్‌డీఎఫ్‌లు విజయం కోసం గట్టిగానే శ్రమించాయి. అయితే ఓటర్లు మాత్రం షఫీవైపే ఉన్నారని తేలింది.

2011లో జరిగిన ఎన్నికల్లో షఫీ 7,403 ఓట్ల తేడాతో సీపీఎం అభ్యర్థి కె.కె.దివాకరన్‌ను ఓడించారు. 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చెందిన శోభా సురేంద్రన్‌పై 17,483 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో సీపీఎంకు చెందిన ఎన్‌.ఎన్‌.కృష్ణదాస్‌ మూడో స్థానంలో నిలిచారు. ఈసారి ఎన్నికల్లో ముగ్గరు అభ్యర్థులు అభివృద్ధి నినాదంతోనే ప్రచారం చేశారు. శ్రీధరన్‌పై మీడియా బాగా ఫోకస్‌ పెట్టింది. అయితే ఎప్పుడైతే ఆయన నోటి వెంట బీఫ్‌ తినేవాళ్లు, లవ్‌ జీహాద్‌ అన్న పదాలు వచ్చాయో పరిస్థితి తిరగబడింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలే ఆయన కొంపముంచాయంటున్నాయి ఎగ్జిట్‌ పోల్స్‌. మైనారిటీ, సెక్యులర్‌ ఓట్లు గంపగుత్తగా షఫీకి పడ్డాయని చెబుతున్నాయి.

Read Also….  Sri Sri: తెలుగు సినిమా పాటలకు కొత్త నడకలు నేర్పిన శ్రీశ్రీ, పాటకు ఆయన కట్టబెట్టిన గౌరవం అనంతం

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం