DGCA: అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీసీఏ
Flights Ban: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కరోనా బారిన పడుతున్నారు. దీంతోపాటు వేలాది మంది ప్రాణాలు
Flights Ban: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కరోనా బారిన పడుతున్నారు. దీంతోపాటు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరుణంలో కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని మే 31 వరకు కేంద్రం పొడిగించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏవియేషన్ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధానికి సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులను మే 31 అర్థరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ప్రకటించింది. దేశం నుంచి లేదా దేశంలోకి అంతర్జాతీయ ప్రయాణ విమానాలపై కేంద్రం గతంలో విధించిన నిషేధం 31 వరకు కొనసాగుతుందని ఏవియేషన్ డిపార్ట్‌మెంట్ తెలిపారు. అయితే ఈ నిబంధనలు అంతర్జాతీయ కార్గో విమానాలకు వర్తించవని పేర్కొంది. అలాగే కొన్ని పరిస్థితుల్లో, కొన్ని మార్గాల్లో అంతర్జాతీయ విమానాలను అనుమతిస్తామని డీజీసీఏ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదిలాఉంటే.. గురువారం రికార్డుస్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3,86,452 కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 3,498 మంది బాధితులు మరణించారు. తాజాగా నమోదైన కేసుల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,62,976( 1.87 కోట్లు) కు పెరగగా.. మరణాల సంఖ్య 2,08,330 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 31,70,228 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
Also Read: