AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazing Facts: పశ్చిమబెంగాల్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు.. హౌరా నుంచి ఎస్‌బీఐ వరకు అన్ని ఆశ్యర్యపరిచే అంశాలే..!

West Bengal Amazing Facts: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే మార్చి 27న మొదటి దశ నుంచి ప్రారంభమైన బెంగాల్‌..

Amazing Facts: పశ్చిమబెంగాల్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు.. హౌరా నుంచి ఎస్‌బీఐ వరకు అన్ని ఆశ్యర్యపరిచే అంశాలే..!
Howrah Bridge
Subhash Goud
|

Updated on: May 02, 2021 | 6:25 AM

Share

West Bengal Amazing Facts: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. మే 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. అయితే మార్చి 27న మొదటి దశ నుంచి ప్రారంభమైన బెంగాల్‌ ఎన్నికలు తుది దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 29వ తేదీతో ముగిసింది. ఇక అదే రోజు ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు కూడా వచ్చాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వెల్లడించాయి. మరికొన్ని ఎగ్జిట్‌ ఫోల్‌ ఫలితాలు బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని వెల్లడించాయి. మరి అసలు ఫలితాలు ఈ రోజుతో తేలిపోనుంది.  అయితే ఇక పశ్చిమబెంగాల్‌కు చరిత్ర కూడా ఉంది. బెంగాల్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి. భారతదేశానికి తూర్పున ఉన్న పశ్చిమ బెంగాల్‌ సంస్కృతి, నాగరికత, దుస్తులు, ఆహారం, భాష తదితర విషయాల గురించి చాలా మందికి తెలియవు. బెంగాల్‌ ప్రజలు మాతృభూమికి సంబంధించిన సంప్రదాయాలను అనుసరిస్తారు.

బెంగాల్‌కు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి..?

► స్వాత్రంత్ర్యానికి ముందు అంటే 1911 వరకు కోల్‌కతా భారత రాజధాని. దీని తర్వాత బ్రిటిష్‌ వారు ఢిల్లీని రాజధానిగా మార్చారు.

► పశ్చిమబెంగాల్‌లో ఉన్న రైల్వే స్టేషన్‌ దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్‌. అంతేకాదు ఇది దేశంలోనే అతిపురాతన స్టేషన్‌ కూడా. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్‌ ఇదే. ఈ స్టేషన్‌లో మొత్తం 23 ప్లాట్‌ఫాంలు ఉన్నాయి. ఈ స్టేషన్‌ నుంచి ప్రతి రోజు సుమారు 600 రైళ్లు రాకపోకలు కొనసాగిస్తుంటాయి.

► బెంగాల్‌లో హౌరా వంతెన ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే వంతెన. ఈ వెంతెన గుండా ప్రతి రోజు సుమారు లక్ష వాహనాలు వెళ్తుంటాయి. వాహనాలతో పాటు ఈ వంతెనపై ప్రజల రాకపోకలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ వంతెన నుంచి రోజూ 1.5 లక్షల మంది వెళ్తుంటారు.

► నోబెల్‌ గ్రహీత రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, మదర్‌థెరిస్సాలు ఇక్కడి నుంచే పురస్కారాలు అందుకున్నారు. ఎందుకంటే రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ బెంగాలి భాషలో రాసిన కావ్యానికి పురస్కారం లభించగా, మదర్‌థెరిస్సా ఎయిడ్స్‌, కుష్టు, క్షయ వాధిగ్రస్తులను అక్కున చేర్చుకున్నారు. ఇక్కడ అనాథ శరణాలయాలను స్థాపించారు. అందుకు సేవలందించినందుకు ఆమెకు పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

► దేశంలో మొట్టమొదటి సారి మెట్రో రైలు బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నడిచింది.

► కోల్‌కతాలో ఉన్న ఈడెన్‌ గార్డెన్స్‌ చాలా కాలంగా దేశంలో అతిపెద్ద క్రికెట్‌ మైదానంగా ఉంది. అయితే అహ్మదాబాద్‌లోని స్టేడియం తర్వాత ఇది మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది.

► బెంగాల్‌లో ఉన్న కోల్‌కతా ఓడరేవు దేశంలోని పురాతనమైనది. దీనిని ఈస్ట్‌ ఇండియా కంపెనీ 1870లో నిర్మించారు.

► బెంగాల్‌లో జరుపుకొనే దుర్గా పూజ ఇప్పుడు దేశ వ్యాప్తంగా జరుపుకొంటారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న బెంగాలీ ప్రజలు కూడా అక్కడ దుర్గా పూజను ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు.

► ఎంతో మంది ఇష్టపడే స్వీట్‌ రస్‌గుల్లా మొట్టమొదటిగా బెంగాల్‌లోనే తయారు చేశారు. మొట్టమొదటిగా నాబిన్‌ చంద్రదాస్‌ అనే వ్యక్తి ఈ మిఠాయిని తయారు చేశారు. దీంతో ఈ రస్‌గుల్లా దేశమంతటా ప్రసిద్ది చెందింది.

► స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు. 1806లో బ్యాంక్‌ ఆఫ్‌ కలకత్తా పేరిట ఈ బ్యాంకు స్థాపించబడింది. బ్యాంక్‌ ఆఫ్‌ కలకత్తా భారత ఉపఖండంలోని పురాతన వాణిజ్య బ్యాంకుగా గుర్తించబడింది. ఇది ఇప్పుడు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేరుతో కొనసాగుతోంది. ఇలా పశ్చిమబెంగాల్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

ఇవీ కూడా చదవండి: Amazing Facts: పుదుచ్చేరి గురించి ఆసక్తికరమైన విషయాలు.. ఇక్కడ ఆగస్టు 16న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొంటారు..ఎందుకో తెలుసా..?

ప్రపంచంలోనే ధనిక హిందూ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా..? భూలోక స్వర్గం ఆ ప్రాంతం..!