Charity: పెన్షన్ డబ్బులు.. మరికొంత అప్పు చేసి ఆ పెద్దాయన ఆసుపత్రికి వెంటిలేటర్లు కొనిచ్చాడు..

కరోనా మహామ్మారి విరుచుకుపడుతోంది. చాలా మంది పేషెంట్స్ మందులు, ఆక్సిజన్, ఆసుపత్రులలో బెడ్స్ దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో కొందరు మేమున్నామంటూ వారికి తమకున్నదాన్లో సహాయం చేస్తున్నారు.

Charity: పెన్షన్ డబ్బులు.. మరికొంత అప్పు చేసి ఆ పెద్దాయన ఆసుపత్రికి వెంటిలేటర్లు కొనిచ్చాడు..
Charity By Old Man
Follow us

|

Updated on: May 01, 2021 | 11:03 PM

Charity: కరోనా మహామ్మారి విరుచుకుపడుతోంది. చాలా మంది పేషెంట్స్ మందులు, ఆక్సిజన్, ఆసుపత్రులలో బెడ్స్ దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో కొందరు మేమున్నామంటూ వారికి తమకున్నదాన్లో సహాయం చేస్తున్నారు. అలాగే మోహన్ కులకర్ణి అనే రిటైర్డ్ వృద్ధుడు తన పెన్షన్ మొత్తాన్ని స్థానిక ఆసుపత్రికి వెంటిలేటర్లు కొనడానికి ఖర్చు చేశాడు. తనకు పెన్షన్‌లో వచ్చిన రూ .4 లక్షలతో పాటు, అన్ని ముఖ్యమైన వైద్య పరికరాలను కొనడానికి అదనంగా రూ .2.5 లక్షల రుణం తీసుకున్నాడు ఆయన.

కోవిడ్ -19 కేసులు అంబర్‌నాథ్ ప్రాంతంలో అకస్మాత్తుగాపెరిగిపోయాయి. ప్రైవేటు రంగంలో పనిచేసిన 65 ఏళ్ల మాజీ ఉద్యోగి కులకర్ణి కరోనా పేషెంట్స్ కు సహాయం చేయడం కోసం ముందుకువచ్చారు. అక్కడి సివిల్ హాస్పిటల్ అవసరమైన పరికరాల కొరతతో నడుస్తోంది. వాస్తవానికి, స్థానిక పౌర ఆసుపత్రిలో డాక్టర్ ప్రశాంత్ రసాల్ అనే వైద్యుడు పారిశ్రామికవేత్తలను, ఇతరులను ఈ పరిస్థితిలో సహాయం చేయమని అప్పటికే అభ్యర్థించారు.

మొదట, కులకర్ణి ఆసుపత్రికి అంబులెన్సులు ఇవ్వాలనుకున్నాడు. “పౌర సంస్థకు తగినంత అంబులెన్సులు ఉన్నాయని, వారికి అదనపు వెంటిలేటర్లు అవసరమని నేను తెలుసుకున్నప్పుడు, నేను అదనంగా 2.5 లక్షల రూపాయలు తీసుకొని వెంటిలేటర్ కొన్నాను” అని ఆయన మీడియాకు చెప్పారు. “నా ప్రయత్నాలు ప్రాణాలను కాపాడగలవని నేను నమ్ముతున్నాను” అని ఆయన అన్నారు.

క్యాన్సర్‌తో భార్యను కోల్పోయిన తరువాత, ఆయన స్థానిక ఆసుపత్రికి కొంత సొమ్ము విరాళం ఇవ్వాలనుకున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితిని చూస్తే, గొప్ప పనిని నిర్వహించడానికి ఇంతకంటే మంచి సమయం ఉండదని ఆయన భావించారు.

ఇక్కడ ఇలా సహకారం అందించినది ఆయన మాత్రమే కాదు. పౌర సంస్థలలో సుమారు 850 మంది ఉద్యోగులు తమ రోజు జీతాన్ని ఆసుపత్రికి 5 బై-ప్యాప్ యంత్రాలను కొనుగోలు చేయడానికి ఉపయోగించాలని నిర్ణయించారు. అవసరం వచ్చినప్పుడు, చాలా మంది ప్రజలు తమ సహాయాన్ని అందించడానికి ముందుకు వస్తూనే ఉంటారు. దానికి వారు ఒక్కోసారి పెద్ద త్యాగాలు చేస్తుంటారు. అటువంటి వారిలో మోహన్ కులకర్ణి కూడా ఒకరు.

Also Read: AP Crime News: అనంతపురం జిల్లాలో తహశీల్దార్ అవినీతి బాగోతం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన వైనం

ట్యాక్స్ చెల్లింపుదారులకు గుడ్ న్యూస్… గడువును పెంచుతూ ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం..