Assembly Election Result 2021: నిలిచేదెవరు.. గెలిచేదెవరు.. నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. టీ9లో ఇలా వీక్షించండి..

Assembly Election Result 2021 Today : దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌...

Assembly Election Result 2021: నిలిచేదెవరు.. గెలిచేదెవరు.. నేడే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. టీ9లో ఇలా వీక్షించండి..
Assembly Election Results 2021
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 02, 2021 | 8:06 AM

Assembly Election Result 2021 Today : దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌ లల్లో ఏయే పార్టీలు అధికారంలోకి రానున్నాయి..? ఎవరు పైచేయి సాధిస్తారు..? అక్కడున్న అధికార పక్షానికి ధీటుగా నిలిచేదెవరు.. గెలిచేదెవరు..? అనేది దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ తృణముల్‌కు.. బీజేపీ చెక్ పెడుతుందా..? లేక మళ్లీ టీఎంసీనే పాగా వేస్తుందా..? అనేది చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి 29న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే మీరు వేగంగా.. ఖచ్చితమైన ఫలితాల వివరాలను చూడాలనుకుంటే.. టీవీ 9 తెలుగు ఛానెల్‌, టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి. ప్రతి రాష్ట్రానికి సంబంధించిన పూర్తి ఫలితాలను వివరాలను స్పష్టంగా పొందుపరచనున్నాం. సీట్ల వారీగా కూడా వివరాలను ఇవ్వనున్నాం.

ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఆయా రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ముందు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు. అనంతరం ఈవీఎంలల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 10 గంటల నుంచి లెక్కింపు ధోరణిని అర్ధం చేసుకోవచ్చు. మధ్యాహ్నం నాటికి ఎవరు గెలుస్తారనేది తెలిసినప్పటికీ.. సాయంత్రం నాటికే పూర్తిగా స్పష్టత రానుంది. కరోనా కారణంగా కొంత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా పూర్తి స్థాయి నిబంధనలతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే ఏజెంట్లకు అనుమతి ఇవ్వనున్నట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోవిడ్ దృష్ట్యా ఓట్ల లెక్కింపు అనంతరం ర్యాలీలు కూడా నిషేధించారు.

పశ్చిమ బెంగాల్‌లో 294 సీట్లు.. 292 సీట్లల్లోనే..

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో 292 సీట్లలో పోలింగ్ నిర్వహించారు. అయితే కరోనా కారణంగా ఇద్దరు అభ్యర్థులు మరణించడంతో ఆ ప్రాంతాల్లో ఎన్నికలను వాయిదా వేశారు. ఇక్కడ ప్రధానంగా అధికార తృణముల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరి పోటీ నెలకొంది.

అస్సాం..

అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు మొత్తం మూడు దశల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేశారు. ఇక్కడ అధికార పార్టీ బీజేపీ, కాంగ్రెస్ + ఎఐయూడీఎఫ్ కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

తమిళనాడు

ఏప్రిల్ 6 న తమిళనాడులోని 232 అసెంబ్లీ స్థానాల్లో ఏకకాలంలో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఏఐఏడీఎంకె, డీఎంకే పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. బీజేపీ ఏఐడీఎంకే జట్టుకట్టగా.. కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీచేశాయి.

కేరళ

కేరళలో కూడా ఏప్రిల్ 6న 140 అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) ఎల్‌డిఎఫ్ కూటమి… కాంగ్రెస్ మద్దతు గల యూడీఎఫ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. భారతీయ జనతా పార్టీ కూటమి కూడా పోటీలోనే ఉంది.

పుదుచ్చేరి

కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6న పోలింగ్ ముగిసింది. ఈసారి బీజేపీ.. కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.

Watch Here For Results Updates : https://tv9telugu.com/elections/livetv

Also Read:

Bengal Elections: ఆద్యంతం ఆసక్తికరం బెంగాల్ పోరు.. ఎగ్జిట్ పోల్సే నిజమైతే దీదీదే మళ్ళీ రాజ్యం

Metro Man Sreedharan: మెట్రోమాన్‌ శ్రీధరన్‌కు ఆశాభంగం తప్పదా?.. కేరళ ఫలితాల్లో ఏం తేలనుంది..?